ఇకపై సలేశ్వర క్షేత్రానికి రావద్దు
—నాగర్‌కర్నూల్ నల్లమల అభయారణ్య ప్రాంతంలో వెలసిన
—సలేశ్వర లింగమయ్య క్షేత్రానికి ఇకపై భక్తులెవరూ రావద్దని అధికారులు సూచించారు.
(నాగర్‌కర్నూల్ -విజయం న్యూస్);-
నల్లమల అటవీ ప్రాంతంలో మళ్లీ కురుస్తున్న వర్షాలతో సలేశ్వరం వెళ్లే భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు.ఈ నేపథ్యంలో సలేశ్వరం ఉత్సవాలు నేటితో ముగియనున్నట్లు తెలిపారు.మరోవైపు వర్షం వల్ల సలేశ్వర క్షేత్రంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.కొండల పైనుంచి గుండంలోకి రాళ్లు జారి పడుతున్నాయి.సలేశ్వర క్షేత్రానికి వెళ్లే మార్గమంతా బురదమయంగా మారింది.