Telugu News

యాదాద్రిలో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ పూజలు

యాదాద్రి విజయం న్యూస్

0

యాదాద్రిలో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ పూజలు
(యాదాద్రి విజయం న్యూస్):-

యాదాద్రి దేవస్థానాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్ రాజన్ సందర్శించారు. బాలాలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

also read;-సండ్ర నీ తీరు మార్చుకో..సండ్ర పై స్వంతపార్టీ నేతల ఫైర్

ఆలయ అర్చకులు, అధికారులు సంయుక్తంగా ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న అలంకార సేవలో గవర్నర్ పాల్గొన్నారు. అంతకు ముందు పూర్తయిన ప్రధానాలయ నిర్మాణాలను గవర్నర్ పరిశీలించారు.