పెద్దపులి బారినపడి మృతిచెందిన జీవాల యజమానులకు నష్ట పరిహారం అందజేత…..
అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు...
పెద్దపులి బారినపడి మృతిచెందిన జీవాల యజమానులకు నష్ట పరిహారం అందజేత…..
—అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు…
(దమ్మపేట/ చండ్రుగొండ విజయం న్యూస్ ):-
మండలంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద పెద్దపులి దాడిలో మృతి చెందిన జీవాల బాధితులకు నష్టపరిహారం అందించిన ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు… గత ఏడాది మండలంలోని పెద్దగొల్లగూడెం, మొండివర్రె గ్రామాల అటవీ ప్రాంతంలో పెద్దపులి బారినపడి మేక, గేదె దాడిలో మృతి చెందాయి.
also read;-వేతన ఒప్పంద జాప్యంపై నిరసన ప్రదర్శన
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ప్రభుత్వం నుండి వన్యమృగాల బారిన పడి మరణించిన జీవాలకు అందించే జీవ వైవిద్య కాంపోనెంట్ ద్వారా నష్టపరిహారాన్ని అటవీ శాఖ ద్వారా మంజూరు చేయించారు. ఈ పరిహారాన్ని సంబంధిత బాధితులకు నారం సుధారాణి ( పెద్ద గొల్లగూడెం )రూ 14000/- నల్ల లోతుల బక్కయ్య ( మొండి వర్రె), రూ.25000/ బాధితులకు అందజేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు కి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.