తండ్రి ఇచ్చిన చిట్టి డబ్బులు ఆన్లైన్ గేమ్ పోగొట్టినందుకు ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
అశ్వారావు పేట:విజయం న్యూస్
తండ్రి ఇచ్చిన చిట్టి డబ్బులు ఆన్లైన్ గేమ్ పోగొట్టినందుకు.
ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
(అశ్వారావు పేట:విజయం న్యూస్);-
తండ్రి ఇచ్చిన చీటి డబ్బులు.ఆన్లైన్ గేమ్ లో పోగొట్టుకొని ఆ విషయం ఇంట్లో చెప్పలేక ఓ ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరాయిగూడెం కి చెందిన గంధం రాజేష్(18) స్థానిక వి కే డి వి ఎస్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి చిట్టి కట్టడానికి పోగేసిన రూ. 20,000 వేల నగదును దాచమని గంధం రాజేష్ కు ఇచ్చాడు. ఈ నగదు తో మొబైల్ ఫోన్ లో ఆన్లైన్ మనీ గేమ్ “ఫ్రీ ఫైర్ “ఆడి డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని తండ్రికి చెప్పలేక తనలో తానే మదన పడుతున్నాడు.
also read :-పార్టీ మారే ప్రసక్తే లేదు
శుక్రవారం తండ్రి చిట్టి కట్టేందుకు డబ్బులు తీసుకురమ్మనడంతో… అసలు విషయం చెప్పలేక గుర్రాలచెరువు రోడ్డు లోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటికి ఫోన్ చేసిన తండ్రికి డబ్బులు పోవడంతో పురుగుమందు తాగాననీ చెప్పాడు. వెంటనే తండ్రి బంధువుల సహాయంతో గంధం రాజేష్ ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన అంబులెన్సులో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందాడు. మృతుడు రాజేష్ కు ఇద్దరు తమ్ముళ్ళు ఉండగా తండ్రి తాపీ మేస్త్రి గా పని చేస్తున్నాడు. తెలిసీ తెలియని వయసులో ఆన్లైన్ ఉచ్చులలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.తల్లి తండ్రులు మీ పిల్లల ఫోన్ పట్ల శ్రద్ద వహించండి….