బంద్ వేళ … పెట్రేగిన నక్సల్స్
– బస్సుకి నిప్పుపెట్టిన మావోయిస్టులు
(భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో – విజయం న్యూస్):-
దండకారణ్య బంద్ వేళ మావోయిస్టులు రెచ్చిపోయారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంటకు సుమారు 15 కిమీ దూరం ( ఆంధ్రా సరిహద్దు ) లోని కోటూరులో బస్సుకి నిప్పుపెట్టి దగ్ధం చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సునుఆదివారం రాత్రి మార్గమధ్యంలో ఆపిన మావోయిస్టులు ప్రయాణీకులను దించిడీజిల్ ట్యాంక్ బద్దలు కొట్టి బస్సుకి నిప్పు పెట్టి తగులబెట్టారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ మార్గంలో ప్రయాణీకులు, వాహనదారులు భయాందోళనలకు గురైనారు. పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
also read;-పీకేకి ఇది సాధ్యమేనా..?
నక్సలైట్ నాయకురాలు నర్మదక్క మృతికి అధికార యంత్రాంగమే కారణమని
ఆరోపిస్తూ ఏప్రిల్ 25న దండకారణ్య బంద్‌కి మావోయిస్టులు పిలుపునిచ్చారు మావోయిస్టు పార్టీ నార్త్ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిధి మంగ్లీ ఆ మేరకు ప్రకటన విడుదల చేసిన విజయం పాఠకులకు విదితమే. 2018లో తెలంగాణలో చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లిన నిర్మల అలియాస్ నర్మదక్కని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారని, సరైన చికిత్స అందక నిర్మల @ నర్మదక్క ఏప్రిల్ 9న మరణించినట్లు పేర్కొన్నారు.