ఆస్తి తగాదాల నేపథ్యంలో సోదరి కుటుంభం పై కత్తులతో దాడి చేసిన సోదరుని కుటుంభం..
జూలూరుపాడు - విజయం న్యూస్
ఆస్తి తగాదాల నేపథ్యంలో సోదరి కుటుంభం పై కత్తులతో దాడి చేసిన సోదరుని కుటుంభం..
( జూలూరుపాడు – విజయం న్యూస్ );-
మండలం లో నీ కొమ్ముగూడెంలో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల నేపధ్యంలో సొంత సోదరి కుటుంభం పై సోదరుడు కుటుంభం కళ్ళలో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. కొమ్ముగూడెం కు చెందిన భోజ్యాలాల్ మరియు పుత్లి భాయి లు సొంత సోదరి సోదరులు.
also read;-గిదేంది సారూ..? మా పొట్టకొట్టకుండ్రీ.
గత కొంతకాలంగా ఆస్తి విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్న నేపద్యంలో నిన్న ఇద్దరి మధ్య గొడవ జరగ్గా పుత్లి భాయి సోదరుడు భోజ్యా లాల్ కుటుంభం పై జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఫిర్యాదులో భాగంగా ఎంఎల్.సి కోసం పుత్లి భాయి కుటుంభం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తిరిగి కొమ్ముగూడెం రాగా అప్పటికే మారణయుధాలతో సిద్ధంగా ఉన్న భోజ్యాలాల్ కుటుంభం పుత్లి భాయ్ పై మరియు తన భర్త మరియు కూతురిపై కళ్ళలో కారం చల్లి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు.
దీనితో ముగ్గురికి కత్తిపోట్లతో తీవ్ర రక్తస్రావం జరగ్గా స్థానికులు కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురికి వైద్యం చేస్తున్న వైద్యులు పుత్లి భాయి భర్త పెరుమాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు… దాడి జరిగిన సంఘటన స్థలాన్ని ట్రైన్ ఏఏస్పీ కాంతిలాల్ పాటిల్, మరియు డిఎస్పి వెంకటేశ్వర బాబు, సీఐ వసంత కుమార్, ఎస్ ఐ శ్రీకాంత్, సంబంధిత అధికారులు పర్యవేక్షించారు