Telugu News

గృహిణి” ఆశ గెలిచింది..!!

ఈ డి యన్ ప్రసాద్ విజయం ప్రతినిధి మణుగూరు

0

గృహిణి” ఆశ గెలిచింది..!!

(ఈ డి యన్ ప్రసాద్ విజయం న్యూస్ ప్రతినిధి మణుగూరు):-

ఇంటర్మీడియట్ తో చదువాపేసి పెళ్లి చేసుకొని ఇల్లాలిగా జీవితం ప్రారంభించిన యువతి పదేళ్లు తిరిగేసరికి మేనేజ్మెంట్ కాలేజి నడిపే స్థాయికి ఎదుగుతుందని ఎవరు అనుకోలేదు.
‘ప్రొఫెసర్ గారి అమ్మాయి’ నుంచి “సన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్” వరకు తాను సాగిన ప్రయాణం లో ఎదుర్కొన్న ఎగుడుదిగుడులు ఆశా జాస్తి వివరిస్తున్నప్పుడు సంకల్పం ఉండాలే గాని ఏదైనా సాధించవచ్చనే సూక్తి కళ్ళ ఎదుట కనిపిస్తుంది. తాను ఎదగడం ఒక్కటే కాదు, తన విద్యార్థులను దేశవిదేశాలోని గొప్ప గొప్ప హోటల్స్ లలో పెద్దపెద్ద ఉద్యోగాలలో చేయించే అదృష్టం కూడా ఆమెకు దక్కింది.

also read :-★ ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు
“దేశంలోని పెద్ద హోటల్లో అన్నిటిలోనూ మా విద్యార్థులు ఉన్నత స్థానాలలో ఉన్నారు. అంతేకాదు, మాల్దీవుల్లోని తాజ్ రీట్రీట్, ఇంగ్లాండ్ లోని మారియట్, హయత్, కొలంబోలోని తాజ్ సముద్ర.. అన్నిట్లోనూ మా విద్యార్థులు మంచి ఉద్యోగులుగా పేరు తెచ్చుకుంటున్నారు, మంచి జీతాలు అందుకుంటున్నారు.. అని వివరిస్తున్నప్పుడు ఆశ ఒక మామూలు మేనేజ్మెంట్ కాలేజి డైరెక్టర్ గా కనిపిస్తారు. పని కోసం ఆమె పెట్టె వ్యక్తిగత శ్రద్ధ, ముఖ్యంగా ఆమె నేపథ్యం విన్నప్పుడు మాత్రం ఆశ్చర్యం అనిపిస్తుంది..

** కసితో పాస్ అయ్యా..!!

ఆశా తండ్రి పాండురంగారావు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కామర్స్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్. తల్లి లీలా కుమారి ఎం పి ల్, పి హెచ్ డి. ఆశా కన్నా ముందు పుట్టిన అక్క వాణి న్యూహాంప్షైర్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. తమ్ముడు ఉన్నత విద్య. అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన అమ్మాయి ఇంటర్మీడియట్ పూర్తి అయిందో లేదో, “నేను శ్రీకాంత్ ను పెళ్లి చేసుకోవాల్సిందే. అది ఇప్పుడే” అని పట్టుబట్టింది. శ్రీకాంత్ చూస్తే నిరుద్యోగి, తండ్రి లేడు, ఆస్తిపాస్తులు ఏమీ లేవు. రంజీ మ్యాచ్ ల క్రికెటర్ గా కాస్త పేరును మాత్రం వెనకేసుకునాడు.

అలాంటి వాడితో ప్రేమ్ ఏమిటి. డిగ్రీ కూడా అవకుండా పెళ్లి ఏమిటి.? ఏమాత్రం వీల్లేదన్నారు ఆశ తల్లిదండ్రులు. “లేదు మేమిద్దరం కలిసి సాధిస్తాం” అనుకుంది ఆశ. అదే అమ్మా నాన్నకు చెప్పి ఒప్పించింది. అలా పెళ్లై కొత్త కాపురం మొదలైంది. ఒక బాబు పుట్టాడు. ఏదో చేయాలన్న తపన ఆమెలో పెరిగింది. వికాస్ విద్యాసంస్థల్లో కౌన్సిలర్ గా చిరు ఉద్యోగంలో చేరింది. మరోవైపు డిగ్రీ చదువు కట్టింది. ఓవైపు పసివాడి ఆలనాపాలనా, మరోవైపు ఉద్యోగం, ఇంకా చదువుకు సమయమేది? మూడేళ్లు గడిచాయి. డిగ్రీ మాత్రం చేతికి రాలేదు. ‘ఇది కూడా చేయలేనా’ అన్న కసి మరింత పెరిగిపోతుంది. నాలుగో ఏడాది, ఒక నెలరోజుల పాటు సెలవు పెట్టి గట్టిగా చదివింది. అంతే అన్ని సబ్జెక్టులు ఒకే సారి పాస్ అయింది.

*చదువుకు అనుభవం తోడు..

విశాఖలోని ఇండో అమెరికన్ మేనేజ్మెంట్ కాలేజీ లో భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగులుగా చేరారు. ఎంబీఏ కాలేజీ లో పని చేస్తూ తనకా డిగ్రీ లేకపోవడం లోటుగా అనిపించింది ఆశకి. అందుకే వెళ్లి ఎంబీఏ లో చేరిందా మే. ముందులాగే ఈసారి చదవడం కుదరలేదు. ఈలోగా పాప పుట్టింది. “రోజూ ఉదయం ఒక గంట ఆలస్యంగా వస్తాను. అయితే సాయంత్రం గంట ఎక్కువగా ఉండి పని పూర్తి చేస్తాను” అని యాజమాన్యం నీ అర్జీచింది. ‘అదేం కుదరదు, అందరితో పాటే మీరు ను’ అన్నారు వాళ్ళు. “నాలుగేళ్లు పనిచేసిన ఆ మాత్రం వెసులుబాటు కు నోచుకోకపోవడం ఇబ్బందిగా అనిపించింది. కాలేజీ నిర్వహణలో మా ఇద్దరికీ మంచి అనుభవం ఉంది. దాంతో మనమే ఓ కాలేజ్ ఎందుకు ప్రారంభించకూడదు అనుకున్నాం..” అన్నారు ఆశ. ఒకసారి అనుకున్నాక వదిలేసే తత్వం కాదు ఆమెది.

also read :-ములుగు జిల్లా అధ్యక్షుడిగా శ్రీకాంత్

భార్యాభర్తలిద్దరూ మరో ఇద్దరు స్నేహితులను కలుపుకొని “సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్”ను 2004 లో ప్రారంభించారు. 20 30 అడ్మిషన్ వస్తే అదే గొప్ప అనుకున్న పరిస్థితిలో 60 70 అడ్మిషన్లు వచ్చాయి. దాంతో ఇక వెనుతిరిగి చూడలేదు. మనదేశంలో పార్క్ గ్రూప్ ‘ఓసి ఎల్ది’ అనే ప్రత్యేక శిక్షణ కు పరీక్ష పెట్టి విద్యార్థులను తీసుకుంటుంది. అందులో నెగ్గితే అద్భుతమైన ఉద్యోగం సొంతమవుతుంది. “ఏటా ఆ పరీక్షల మా విద్యార్థులు ఐదారుగురు నెడుతున్నారు.

ఎంతో పేరున్న పెద్ద కాలేజీలో సైతం ఇది సాధ్యం కావడం లేదు” అంటారు మెరుస్తున్న కళ్ళతో ఆశ.”చదువుకుంటూ పనిచేసే వెసులుబాటు అయ్యేలా మా సిలబస్ ను రూపొందించాం. దానివల్ల ఎంబీఏ చదువుతూనే నెలకు 8 నుంచి పదివేల రూపాయలు సంపాదించుకునే అవకాశం మా విద్యార్థులకు ఉంది. పైగా ఉద్యోగంలో చేరే సమయానికే బోలెడంత అనుభవం గడిస్తున్నారు.” అనే ఆశ ఆ తరహా ఫలితాల కోసం రోజుకు పన్నెండు గంటలపాటు శ్రమిస్తారు.

*అమ్మ ఉంటే ఎంత బాగుండేదో..!

‘కాలేజీ పెట్టడం, బాగా నడుస్తుంది. ‘అనుకోని ఊరుకోలేదు ఆశ. విశాఖ దగ్గర తగరపువలసలోని ‘చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డిజేబుల్డ్’ అనే సంస్థను దత్తత తీసుకున్నారు. అక్కడి విద్యార్థులు అందరితో సమానంగా ఎదగడానికి అవసరమైన ఆర్థిక/హార్దిక వనరులను చేకూరుస్తున్నారు. తన మేనేజ్మెంట్ కాలేజీలోనూ ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు ప్రత్యేక సహాయం అందిస్తూ మరి ప్రోత్సహిస్తున్నారు. “నూకరాజు అని ఈ ఏడు చదువు పూర్తి చేసుకుని దుబాయ్ రాయి గ్రూప్ సంస్థలో ఉద్యోగం సంపాదించుకున్న మా విద్యార్థిని తలచుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది.

also read :-మేడారం లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర సమితి 21 వ,ఆవిర్భావ దినోత్సవం…..

తానొక పేద మృత్యుకారా కుటుంబం నుంచి వచ్చాడు. ఓ సెమిస్టర్ తర్వాత ఫీజు కట్టలేను. చదువు మానేస్తాను అన్నాడు. నేపథ్యం ఆరా తీస్తే తెలిసింది. ఇక ఫీజులు హాస్టల్ వసతి అన్నీ ఉచితంగా అందించాం. అతనే మా ఈ ఏటి టాపర్..”అంటూ చెప్పుకొచ్చారు ఆశ. అయితే అంత విజయపథంలో ప్రయణమేనా ? వైఫల్యాలు ఏమీ లేవా? అని అడిగితే “లేకేం. నన్నొక విద్యావంతురాలు గా చూడాలని మా అమ్మ అనుక్షణం తపించే ది. ఈ బాధ్యతల వల్ల నేను ఎంబీఏ పరీక్షలకు వెళ్లడమే కుదర లేదు. చివరికి నేను పరీక్ష కట్టిన ఆ సమయంలోనే ఆమె కిడ్నీలు చెడిపోయి తీవ్రమైన అనారోగ్య పాలయింది. అమ్మ చనిపోయిన పది రోజుల్లోపే పరీక్షలు.

ఇలాంటి సమయంలో నువ్వు పరీక్షలు రాయటం ఏమిటి అని ఇంట్లో బంధువులంతా లందరూ వద్దన్నారు. కానీ నాకు తెలుసు. అమ్మ ఆత్మ సంతోషించాలి అంటే. పరీక్షలు రాయడమే మార్గమని. మార్కెటింగ్/హెచ్ ఆర్ ప్రధానాంశాలుగా 19 పేపర్లును ఒకటే సారి రాశాను. అన్ని పాస్ అయ్యాను. ఫలితాలు వచ్చిన రోజున కుటుంబ సభ్యులందరూ సంతోషిస్తే నేను మాత్రం బాగా ఏచ్చేసాను. అమ్మ బతికుండగా నేను ఎంబీఏ అనిపించుకుంటే ఎంత సంతోషించేదో! నా విజయాన్ని ఎంతమంది గొప్పగా చెప్పుకునేదో! ఆమెకు ఆ ఆనందాన్ని ఇవ్వకపోవడం నా వైఫల్యమే” అన్నారు ఆశ.