ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లకి గాయాలు
– రాయపూర్ ఆస్పత్రికి తరలింపు
(భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో – విజయం న్యూస్):-
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలుడులో ఇద్దరు డీఆర్‌జీ జవాన్లు గాయపడ్డారు. రోడ్డు డామినేషన్ కోసం జవాన్లు బైక్‌పై వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఎస్‌పి సదానందకుమార్, నక్సల్ ఆపరేషన్ ఏఎస్‌పి అక్షయ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
also read;-ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లకి గాయాలు
కురుస్నార్ పోలీస్‌స్టేషన్ పరిథిలోని కొడాలి గ్రామం నుంచి జార్వాహి వైపు ఐటీబీటీ, డీఆర్‌జీ జవాన్లు వెళుతుండగా శక్తివంతమైన ఐఈడీ పేలుడు సంభవించింది. డీఆర్‌జీ కానిస్టేబుల్ సనౌ వడ్డే, రామ్‌జీ పొటై గాయపడ్డారు. రామ్‌జీ పొటై కంటికి తీవ్ర గాయమవడంతో చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.