దర్బా క్యాంపుపై మావోయిస్టుల దాడి
నక్సల్స్ కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలు
(భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో – విజయం న్యూస్):-
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కుత్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్భా క్యాంపుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఆకస్మిక దాడిలో నలుగురు జవాన్లు గాయపడ్డారు. రాత్రి సుమారు 11 గంటల సమయంలో కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని భద్రతా బలగాల శిబిరంపై నక్సలైట్లు కాల్పులు జరిపారు.
also read :-కేసీఆర్ అసలు మనిషేనా..?
భద్రతా బలగాలు రెప్పపాటున తేరుకొని ఎదురుకాల్పులు జరపడంతో నక్సలైట్లు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను రాయ్‌పూర్‌కు రిఫర్ చేశారు. మరో ఇద్దరు జవాన్లు బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో మావోయిస్టుల కోసం ముమ్మరంగా చర్యలు ప్రారంభించారు.