Telugu News

మావోయిస్టుల అలజడి

రహదారిపై కందకాలు తవ్విన మావోయిస్టులు

0

మావోయిస్టుల అలజడి

 

రహదారిపై కందకాలు తవ్విన మావోయిస్టులు

 

 (భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో  విజయం న్యూస్);-

 

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అలజడి సృష్టించారు.   కుట్రు – బెద్రే రహదారిపై మావోయిస్టులు 14 చోట్ల కందకాలు తవ్వారు.  పలుచోట్ల బ్యానర్లు కట్టారు.  పోలీసు శిబిరానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని, ఇంద్రావతి నదిపై వంతెన నిర్మాణం ఆపాలని,  అమాయక ప్రజలను  నక్సలైట్లుగా ఆరోపిస్తూ వేధించడం మానుకోవాలని బ్యానర్లలో పేర్కొన్నారు.

also read :-ఏప్రిల్ 4 నుంచి ఖమ్మం జిల్లాలో షర్మిళ పాదయాత్ర

రోడ్డుకు అడ్డంగా గోతులు తవ్వడం వలనఆ మార్గంలో సోమవారం ట్రాఫిక్‌ స్తంభించింది.  సమాచారం అందుకున్న  పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని జేసీబీ సాయంతో గోతులను పూడ్పించి రాకపోకలు పనరుద్ధరించారు.  మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు బీజాపూర్ ఎస్‌పి కమలోచన్ కశ్యప్ తెలిపారు.