Telugu News

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం…….

గ్రామ గ్రామాన మార్మోగిన శ్రీ రామనామ స్మరణ...

0

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం…….

గ్రామ గ్రామాన మార్మోగిన శ్రీ రామనామ స్మరణ…

(భద్రాద్రికొత్తగూడెం బ్యూరో-విజయంన్యూస్);-
శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని మండల వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.. మండలంలోని పలు గ్రామాల్లో మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్న శుభముహూర్తాన మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండగ జరిపారు.

also read :-వరి ధాన్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కొనుగోలు చేయాలని అఖిలపక్ష పార్టీల రాస్తారోకో

కల్యాణానికి ముందుగా ఉత్సవ విగ్రహాలను ముస్తాబు చేసి పెళ్ళికొడుకు రామయ్యను, పెళ్లికూతురు సీతమ్మవారిని కళ్యాణ వేదిక పైకి తీసుకొచి కళ్యాణ తంతు నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు ఆలయాల ప్రాంగణంలో భక్తుల కోసం చలువ పందిళ్లులు, షామియానాలు ఏర్పాటు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన నిర్వహించారు..