అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం..
▪️పోటెత్తిన భక్తులు, కన్నుల పండుగగా కళ్యాణం..
▪️ రెండేళ్ళ తరువాత భక్తుల మధ్య స్వామి వారి కళ్యాణం..
▪️హాజరైన మంత్రులు పువ్వాడ, ఇంద్రకరణ, సత్యవతి రాథోడ్.
(భద్రాద్రికొత్తగూడెం బ్యూరో-విజయంన్యూస్);-
రాములోరి కళ్యాణంతో భద్రాద్రి పులకించిపోయింది. ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయంగా కళ్యాణంకు అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు భక్తులు లేకుండా ఆలయ అర్చకుల సమక్షంలోనే జరిగిన కళ్యాణం.. నేడు భక్తుల నడుమ భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం జరిగింది. శ్రీరామనవమి పర్వదినాన్ని జరుపుకోవడానికి రాములోరి కల్యాణానికి పవిత్ర పుణ్యక్షేత్రం వేదికైంది. స్వామి వారి కళ్యాణంతో భద్రగిరి పులకించిపోయింది.
also read :-దాసరదీ.. కరుణాపయోనిది..
ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా తరలించారు. సీతారాముల కల్యాణం వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సముహూర్తంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. దీన్ని వీక్షించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు వంటి పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరైయ్యారు. ప్రభుత్వం తరుపున సంప్రదాయబద్ధంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పట్టువస్త్రాలు, జిల్లా ఇంఛార్జి, రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముత్యాల తలంబ్రాల సమర్పించారు.
also read :-నేడే భద్రాద్రి రాముని కళ్యాణం
వారితో పాటు రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ హాజరైయ్యారు. స్వామి వారి కళ్యాణం చూసేందుకు సుమారు 2.5 లక్షల మంది తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు వడదెబ్బ తగలకుండా.. తాగు నీటితో పాటు మజ్జిగ ఎర్పాటు చేశారు. భక్తజనులకు తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచారు. భారీ పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా నీడలో సీతారాముల కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది.