ఈ కంపు మేము భరించలేము…..
మమ్మల్ని కాపాడండి……
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆర్తనాదం…..
( చండ్రుగొండ -విజయం న్యూస్) : –
పేరుకే రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్, పరిసరాల పరిశుభ్రత, అని టీవీల్లో ప్రకటనలు తప్ప, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత లాగా ప్రభుత్వ ఉంది, ….వివరాల్లోకి వెళితేమన వాళ్ళకిబొత్తిగా బుద్ధి,సిగ్గు,లేదోయ్ అంటాడు
కన్యాశుల్కం లోని గిరీషం,సరిగ్గా ఆ మాటలకు సరిపడే విధంగా ఉంది చంద్రుగొండ మండల కేంద్రము లోని ప్రధాన రహదారికి కూతవేటు దూరంలోని జాతీయ రహదారి. వివరాలలొకి వెళ్లితే చంద్రుగొండ మండల,మరియు పంచాయితి అయిన కేంద్రం లో ప్రదాన రహదారికి కూత వేటు లొ ఓ రహదారి ఉంది నిత్యం రహదారి గుండా పరిసర ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రహదారి ని ఆనుకొని ఉంది.నియోజకవర్గం లోని రెండవ పెద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది.ఈ పాఠశాల ప్రహరి గోడకు ఆనుకొని,రానుపోను వారు మూత్రవిసర్జన చేస్తుంటారు.
also read;-మది నిండా మెదిలే ఆలోచనలు మీవే…!
దీనివలన భయంకరమైన కంపు పాఠశాలలొకి వస్తుంటది.కనీసం తరగతి గదిలో కూర్చొనే పరిస్థితి కనిపించడం లేదు .ఉపాధ్యాయులు ఊపిరి బిగపట్టి పాఠాలు చెప్పవలిసి వస్తుందని,వాపోతున్నారు.ఈ పాఠశాలలొ 700 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు.ముఖ్యంగా మూత్రవిసర్జన చేస్తుండగా పాఠశాల లోని యుక్త వయసు బాలికల పరిస్తితి మరింత ధారుణంగా ఉంది.ఇక్కడ ఉచ్చలు పోయవద్దని చెప్పినా వినటం లేదు.కనీసం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తే కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుందని, పాఠశాల యాజమాన్య కమిటి, హెడ్మాస్టర్ భావించి గ్రామపంచాయతి కార్యదర్శి, సర్పంచ్, మరి ఇతర పెద్ద మనుషుల ద్రుష్టికి తీసుకెల్లారు.అసలు ఆవిషయాన్ని పంచాయతి పాలకవర్గం పట్టించుకోలేదు.ఈ కంపును మేము భరించలేమని విద్యార్థులు తెగేసి చెప్పుతున్నారు.ఇప్పటికైనా మండల,పంచాయతి పాలకవర్గం, అధికారులు స్పందించి ఈ సమస్య కు శాశ్వత పరిష్కారం కనుక్కొవాలని కోరుతున్నారు.