Telugu News

నేడే భద్రాద్రి రాముని కళ్యాణం

అపురూప వేడుకకు సర్వం సిద్ధం

0

నేడే భద్రాద్రి రాముని కళ్యాణం

—-అపురూప వేడుకకు సర్వం సిద్ధం

—–కన్నుల పండుగగా ఎదుర్కోలు ఉత్సవం

—-వేడుకకు హాజరైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

(భద్రాద్రికొత్తగూడెం బ్యూరో-విజయంన్యూస్);-

శ్రీసీతారామచంద్ర స్వామి వారి జగత్ కల్యాణానికి భద్రగిరి సిద్ధమైంది. కళ్యాణం నిర్వహించే మిధిలా ప్రాంగణం ముస్తాబైంది. అపురూప జంట శ్రీ సీతా రాముల వారి కళ్యాణానికి కనులార వీక్షించాలని అశేష భక్త జనం భద్రగిరి చేరుకొంది. ఆదివారం ఉదయం 10:30 నుంచి 12:30 వరకు జరగనున్న రాములోరి కళ్యాణం భక్తుల మదిని దోచనుంది. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకకు హాజరవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వామివారి కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేయనున్నారు. మంగళవారం శ్రీరామ పట్టాభిషేకం వేడుక జరగనుంది.

also read :-శ్రీ సీతారాముల కళ్యాణం చూతుము రారండి…!

ఇదిలా ఉండగా శనివారం రాత్రి జరిగిన స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు…. నేడే భద్రాద్రి రాముని కళ్యాణం : దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరి పుణ్యక్షేత్రంలో…. భద్రాద్రి రాముని కళ్యాణం ఆదివారం అత్యంత కన్నులపండువగా జరగనుంది. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. ఆదివారం వేకువజామున రెండు గంటలకే రామాలయం తలుపులు తెరుస్తారు. అనంతరం స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహిస్తారు. అర్చకస్వాములు మూల వరులకు అభిషేకం చేస్తారు. గర్భగుడిలో ఏకాంతంగా ధ్రువ మూర్తుల తిరు కల్యాణం నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులకు అలంకారం చేస్తారు.

also read :-పెంచిన ఆయిల్,నిత్యవసర సరుకుల ధరలు, గ్యాస్, విద్యుత్,బస్సు చార్జీలను తగ్గించాలి,

అనంతరం ఉదయం 9:30 నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని బాజాభజంత్రీలు, సన్నాయి మేళతాళాల నడుమ, భక్తుల కోలాహలంతో ఊరేగింపుగా మిథిలా ప్రాంగణంలో తీసుకొస్తారు. అక్కడ స్వామివారిని వేంచేయింప చేసి… ఉదయం 10:30 నుంచి 12:30 వరకు అర్చక స్వాములు శ్రీ సీతా రాముల వారి తిరు కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్త రామదాసు వారు చేయించిన బంగారు ఆభరణాలు శ్రీసీతారామచంద్రస్వామి వారికి ధరింప చేస్తారు. కచ్చితంగా అభిజిత్ లగ్నం 12:30 లకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పై జిలకర్ర పెట్టి…కళ్యాణ తంతును ముగిస్తారు. కళ్యాణం జరుగును సందర్భంలో అర్చక స్వాములు వివిధ మంత్రాలను పఠిస్తారు. కళ్యాణం అనంతరం స్వామి వారిని తిరిగి ఆలయంకు తీసుకువెళ్తారు. ఆదివారం సాయంత్రం శ్రీరామ పునర్వసు దీక్షను ప్రారంభిస్తారు. చంద్రప్రభ వాహనంపై సాయంకాలం వేళ స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహిస్తారు.

అపురూప వేడుకకు సర్వం సిద్ధం : భద్రాచలంలో శ్రీ సీతా రాముల వారి కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వేడుకకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీ సీతారాముల వారి కళ్యాణంకు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరవుతున్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామి వారికి మంత్రులు సమర్పించనున్నారు. స్వామివారి కల్యాణం నిర్వహించే ప్రాంగణంను అందంగా ముస్తాబు చేశారు. 25 సెంటర్లుగా ప్రాంగణాన్ని విభజించారు. ఈ కళ్యాణాన్ని భక్తులు నేరుగా వీక్షించేందుకు అనువుగా ఏర్పాటు చేశారు.

also read ;-పేదవారి భూములు లాక్కుంటే యుద్ధమే

ఏసీలు, కూలర్లు,ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. మిథిలా ప్రాంగణంను చాందినీ వస్త్రాలతో అందంగా అలంకరించారు. పట్టణ ప్రధాన వీధుల్లో స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం మజ్జిగ ప్యాకెట్లు అందజేయనున్నారు. మెడికల్ క్యాంపులను ఏర్పాటుచేశారు. సమాచార కేంద్రాన్ని నెలకొల్పారు. ప్రత్యేక శానిటేషన్ ఏర్పాట్లు చేస్తున్నారు. 2500 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రధాన కూడళ్లలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో అధికారులు భద్రాచలంలో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా కోవిడ్ ఎఫెక్ట్ నేపథ్యంలో మిథిలా ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరగలేదు.

ఈసారి బహిరంగంగా మిదిలా ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరగనున్న నేపథ్యంలో ఈ కళ్యాణాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ వేడుకకు లక్ష మందికి పైగానే భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు కన్నుల పండువగా ఎదుర్కోలు ఉత్సవం ;

also read :-పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే’ అని ప‌రీక్ష‌లో రాసిన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి..

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ఆదివారం స్వామివారి కల్యాణం జరగనున్న నేపథ్యంలో…. సాంప్రదాయ బద్ధంగా ముందురోజు జరిగే స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి… స్వయంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. స్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి ఎదుర్కోలు ఉత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. బాజాభజంత్రీలు సందడి, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, కోలాట నృత్యాలు మధ్య ఈ వేడుక అపురూపంగా సాగింది. వేడుకను వీక్షించిన భక్తులు తన్మయానికి గురయ్యారు. సోమవారం మిథిలా ప్రాంగణంలో శ్రీరామపట్టాభిషేకం వేడుక జరగనుంది. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ హాజరుకానున్నారు