Telugu News

ఇద్దరు మావోయిస్టులు అరెస్టు

పేలుడు పదార్థాలు స్వాధీనం

0

ఇద్దరు మావోయిస్టులు అరెస్టు

– పేలుడు పదార్థాలు స్వాధీనం

( భద్రాచలం – విజయం న్యూస్):-

గోదావరి వంతెన సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న బూర్గంపాడు పోలీసులు ఇద్దరు మావోయిస్టులను పట్టుకొని అరెస్టు చేశారు. ఏఎస్‌పి రోహిత్ రాజ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బూర్గంపాడు ఎస్‌ఐ ఖాజా నసీరుద్దీన్‌ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రాచలం వైపు నుంచి మోటారు సైకిల్‌పై ఒక బ్యాగ్‌తో వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు వెంబడించి పట్టుకున్నారని తెలిపారు. వారిని విచారించగా, పామేడు ఎల్‌వోఎస్ సభ్యులు హేమల గంగి, సవలం నగేష్‌గా గుర్తించినట్లు తెలిపారు.

also read :-శక్తివంతమైన జపనీస్‌ సాంకేతికతతో తీర్చిదిద్దబడిన సోలిస్‌ యాన్మర్‌ ట్రాక్టర్స్‌

ఎల్‌వోఎస్ కమాండర్ కమల, అగ్ర నాయకులు దామోదర్, ఆజాద్‌ల సూచన మేరకు అడవిలో పేలుడు పదార్థాలను దాచిపెట్టేందుకు ఈ ప్రాంతానికి వస్తున్నారని తెలిపారు. వారి బ్యాగ్‌‌లో 30 జెలటిన్ స్టిక్స్, 24 డిటోనేటర్లు 2 బండిల్స్ కార్డెక్స్ వైర్, రూ 31,500 నగదు రూ. అందులో 31,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఇద్దరు నిందితులు మావోయిస్ట్ టీసీవోసీ కార్యక్రమంలో ఇతర పార్టీ సభ్యులతో కలిసి రాసపల్లి, యర్రపల్లి ఏరియాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. కిస్టారంపాడు, బత్తినపల్లి గ్రామాల మధ్య అటవీ వాహనాలను దగ్ధం చేసిన సంఘటన, అదే సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులలో పాల్గొన్నట్లు తెలిపారు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ కోసం కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు.