కన్నాయిగూడెం, వైన్స్ షాప్ లో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు
:- జిపి, లైసెన్స్ లేకుండా వైన్స్ షాప్, చెలామణి
కన్నాయిగూడెం, వైన్స్ షాప్ లో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు
:- జిపి, లైసెన్స్ లేకుండా వైన్స్ షాప్, చెలామణి
:- ఎమ్ ఆర్ పీ, ధరలకంటే అధిక ధరలకు మద్యం అమ్మకం,
:- పటించుకొని ఎక్సైజ్ అధికారులు,
:- వైన్స్ షాప్ కాంటాక్ట్, అధికార పార్టీ రాజకీయ నేత ఐనందుకేనా ?
(కన్నాయిగూడెం,-విజయం న్యూస్);-
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లోని గుర్రేవుల గ్రామంలోగల లక్ష్మీ నరసింహ వైన్స్, షాప్ కాగా ఇక్కడ అడిగేవారు లేరు ఎక్సైజ్ శాఖ అధికారులు పటించుకోరు, వైన్స్ షాప్ వారు ఒక మందు ఫుల్ బాటిల్ కు ఎంత రేటుకు అమ్మితే అంతే, ఇక్కడ వైన్స్ షాప్ వారిని అడిగేవారే లేరు, దర్జాగా కొటర్ బాటిల్ కు ఎమ్ ఆర్ పి, ధరల కంటే ఎక్కువ రూ,, 20, నుండి రూ,, 30, రూపాయల వరకుదోచుకుంటున్న వైనం, ఇది ఏంటని ప్రశ్నిస్తే ఇక్కడ ఇంతే మీకు ఇష్టం ఉంటే కొనండి ఇష్టం లేకుంటే కొనకండి, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, అనే చందంగా మండలంలోని వైన్స్ షాప్ ఉందని మండలంలోని మందుబాబులు తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు,
also read :-భూపాలపల్లి ప్రాణహిత పుష్కరాల్లో భాగంగా
ఇదిలా ఉండగా గుర్రేవుల గ్రామంలో ని నడి ఊరి మధ్యలో ప్రభుత్వ అధికారులు ఆదేశాలమేరకు ఊరికి 200 లేదా 100, మీటర్ల దూరంలోనే వైన్స్ షాప్ ఉండాలి, జన సమూహలో వైన్స్ , మద్యం అమ్మకూడదు, తగా కూడదు, ప్రభుత్వ అధికారులు ఆదేశాలు బెకేతారు చేస్తు పట్టించుకోకుండా ఊరి నడి బొడ్డున మధ్యలో వైన్స్ షాప్ ఉండటం గమనార్థం, చిన్న పిల్లలు, విద్యార్థులు, మహిళలు అధికంగా తిరిగే ప్రదేశంలో, దానికి సంబంధించిన ఆధారాలు అనగా గ్రామపంచాయతీ నుండి అనుమతి అనగా, లైసెన్స్ లేకుండా నడపడం ఏంటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు,
also read :-ఇకపై సలేశ్వర క్షేత్రానికి రావద్దు
ఇదంతా చూస్తూ, చూసి చూడనట్లు మండల అధికారులు ఉంటున్నారంటే ఈ వైన్స్ కాంటాక్ట్ ఒక అధికార పార్టీ రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిది, అయినందున అని గుసగుసలు వినిపిస్తున్నాయి, ఇప్పటికయినా ప్రభుత్వ ఎక్సైజ్ అధికారులు, జిల్లా కలెక్టర్, స్పందించి తక్షణమే ఈ వైన్స్ షాపును ఊరికి 200, వందల లేదా 100, మీటర్ల దూరంలో ఉండే విదంగా చర్యలు తీసుకోని విద్యార్థుల కు మహిళలు, గ్రామంలో ప్రజలకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు,