జిల్లా గిరిజన వెల్ఫేర్ శాఖ – ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న అవినీతి అక్రమల పై సమగ్ర విచారణ జరపాలి…!
ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి కే. సాయికుమార్
జిల్లా గిరిజన వెల్ఫేర్ శాఖ – ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న అవినీతి అక్రమల పై సమగ్ర విచారణ జరపాలి…!
– ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి కే. సాయికుమార్
ఎస్ ఎఫ్ ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ డేవిడ్ వినతి పత్రం అందజేత
(మహబూబాబాద్- విజయం న్యూస్)
మహబూబాబాద్ జిల్లా గిరిజన వెల్ఫేర్ శాఖ – ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న అవినీతి అక్రమల పై సమగ్ర విచారణ జరపాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి కే. సాయికుమార్ అన్నారు.ఎస్ ఎఫ్ ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సాయి కుమార్ మాట్లాడుతూ. అక్రమ డిప్యుటేషన్ ను రద్దు చేయాలి అని, లక్ష రూపాయల వాటాల తో అక్రమ పోస్టింగ్లు ఆపాలని కోరారు. హాస్టల్లో సమస్యలు పట్టించుకోకుండా,మెనూ పాటించకుండా గిరిజన విద్యార్థుల పొట్టలు కొడుతూ అధికారులు కడుపు నింపుకుంటున్నరు అని ఆవేదన వ్యక్తం చేసారు.
also read :-నవజ్యోతిసిద్దూకు జైలు శిక్ష్
గిరిజన వెల్ఫేర్ అధికారి తమకు అనుకూలమైన వర్కర్ లను నియమించుకుని అప్పటి దాకా పని చేసే వర్కర్లను సాగనంపడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. కొంత మంది వర్కర్లను ఇంటి వద్ద ఉంచి వారి పేరు మీద వాటాలు పొందుతున్నారు అని అన్నారు.తక్షణమే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి గుగులోత్ సూర్య ప్రకాష్, నాయుకులు ప్రవీణ్, రాజేష్ పాల్గొన్నారు.