పేదల భూముల జోలికొస్తే పోరాటమే.
మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు.
(సుంక శ్రీధర్ పెద్దపల్లి – విజయం న్యూస్):-
పరిశ్రమల పేరిట పేద రైతులు దున్నుకొని సాగుచేసుకుంటున్న భూములను లాక్కుంటే ఉపేక్షించబోమని, ఎంతటి పోరాటానికైనా సిద్దమని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఎలిగేడు మండలం లోని ర్యాకల్ దేవ్ పల్లి రెవెన్యూ గ్రామం లోని రాములపల్లి శివారు లో గల 167 సర్వే నెంబర్ లో గల 85.28 ఎకరాల భూమిని ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ స్థలాన్ని అక్కడి రైతులతో పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు.గత ప్రభుత్వాలు పేదలకు పంచిన భూములను అక్రమంగా లాక్కొని పేదల పొట్టపై కొట్టడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు.
also read :-సమన్వయంతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి….!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసైన్డ్ పట్టా ఐదు ఎకరాల లోపు ఉన్నవారి నుండి గుంట భూమి తీసిన ఊరుకోబోమని అన్నారు. పేదలకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఉన్న భూములు లాక్కోవటంతో పేదరైతులు రోడ్డున పడతారని ప్రభుత్వం ఆ ఆలోచన విరమించుకోవాలి అని అన్నారు.సాగుకు పనికిరాని భూములు మాత్రమే పరిశ్రమలకు కేటాయించాలని పంట పొలాలు కాదన్నారు.దీనిపై కలెక్టర్,అడిషనల్ కలెక్టర్లతో మాట్లాడానని పేదల భూముల జోలికి రావద్దని ఫోన్లో తహసీల్దార్ కి విన్నవించారు.మా భూములు మాకే ఉండాలని ఉన్న భూములు పోతే మాకు ఆత్మహత్యలే శరణ్యమని అక్కడి రైతులు నినదించారు.
also read :-★ ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు
ఈ కార్యక్రమంలో,పాటల రమేష్, రాముడి సంజీవరెడ్డి, కాల్వల సీత రామ్ రెడ్డి,వేల్పుల కొమురయ్య, ఓజ్జె శ్రీకాంత్,ఓజ్జె కనకయ్య, సందవేని నరేష్, రైతులు ఓజ్జె సదయ్య, ఓజ్జె కనకయ్య, బోలె పోచయ్య,ఒళ్లెప్పు జంగయ్య, బత్తుల సారయ్య, సమ్మయ్య,జి రాములు,లచ్చయ్య, తదితర రైతులు మహిళలు పాల్గొన్నారు.