Telugu News

ఆగస్ట్‌ 12న ఏజెంట్‌గా వస్తోన్న అఖిల్‌

సినిమా-విజయంన్యూస్

0

ఆగస్ట్‌ 12న ఏజెంట్‌గా వస్తోన్న అఖిల్‌
(సినిమా-విజయంన్యూస్)
మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ తరవాత ప్రస్తుతం అఖిల్‌ అక్కినేని సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ’ఏజెంట్‌’ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన అఖిల్‌ ఫోటోలు, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినిమా పైన భారీ అంచనాలను నమోదు చేశాయి. తాజాగా ఈ చిత్ర విడుదల తేదిను ప్రకటిస్తూ మేకర్స్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ’ఏజెంట్‌’ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. మేకర్స్‌ విడుదల చేసిన పోస్టర్‌లో అఖిల్‌ చేతిలో గన్ను పట్టుకొని మాస్‌ మేకోవర్‌తో స్టైలిష్‌గా ఉన్నాడు. మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి కీలకపాత్రలో ఈ చిత్రంలో నటిస్తున్నాడు. సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది.

also read :-ఓవర్సీస్‌లో మంచి టాక్‌ సొంతం చేసుకున్న రాధేశ్యామ్‌

ఏకే ఎంట్టంల్గªనమెంట్స్‌ సంస్థతో కలసి సురేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ’మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన అఖిల్‌ ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫుల్‌ యాక్షన్‌ ఎంట్ర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ’ఏజెంట్‌’ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం కోసం అఖిల్‌ తన దేహాన్ని సానపెట్టాడు. ఇదివరకే మేకర్స్‌ అఖిల్‌ ఫోటోలను విడుదల చేశారు. 6 ప్యాక్‌ బాడీతో కండలు తిరిగిన దేహంతో అఖిల్‌ మాస్‌ మేకోవర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైయ్యాడు. ఈ చిత్రం తర్వాత అఖిల్‌ బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్‌తో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కతున్నట్లు టాక్‌. బాలీవుడ్‌ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు టాక్‌. ఈ చిత్రంలో అఖిల్‌కు జోడిగా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

 

please subscribe this chanel smiling chaithu