Telugu News

అట్లీ – షారుఖ్ ఖాన్ సంఖి

0

తేరీ మెర్సల్ బిగిల్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అతని రేంజ్ ను అమాంతంగా ఆకాశానికి పెంచేశాయి.

విజయం డైలీ
కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ దర్శకుల్లో ఒకరైన అట్లీ కుమార్ బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. దళపతి విజయ్ తో వరుసగా హిట్స్ అందుకున్న అట్లీ నెక్స్ట్ సినిమాలు సైతం మరో లెవల్లో ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

తేరీ మెర్సల్ బిగిల్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అతని రేంజ్ ను అమాంతంగా ఆకాశానికి పెంచేశాయి. దీంతో అతని తదుపరి సినిమాలపై కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా అంచనాలు పెరుగుతున్నాయి.

ఆ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఎన్టీఆర్ కూడా అట్లీ కుమార్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అయితే సరైన కథ సెట్ అవ్వగాపోవడంతో వారి కాంబినేషన్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు అట్లీ బాలీవుడ్ బడా హీరో షారుక్ ఖాన్ తో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. రెండేళ్లుగా జరుగుతున్న ఈ చర్చలకు ఇటీవల ముగింపు కార్డు పడినట్లు సమాచారం.

Atli With Sharukh khan