Telugu News

నా జీవితంలో బెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్

== లేఖను విడుదల చేసిన తారక్‌

0

నా జీవితంలో బెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్

== లేఖను విడుదల చేసిన తారక్‌

(సినిమా-విజయంన్యూస్)

నా జీవితంలో బెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ అని సిని హీరో నందమూరి తారకరామారావు(జూనియర్ ఎన్టీఆర్) అన్నారు. ఈ మేరకు ఆయన లేఖను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థతి నేలకొంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ’ఆర్‌ఆర్‌ఆర్‌’ హవానే కొనసాగుతుంది. ఏ థియేటర్‌కు వెళ్ళినా ట్రిపుల్‌ఆర్‌

also read;-యాదాద్రి దివ్య‌క్షేత్రం సాక్షాత్కారంతో నెర‌వేరిన సీఎం కేసీఆర్‌ సంక‌ల్పం

బొమ్మే. సౌత్‌ నుంచి నార్త్‌ వరకు ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు పరుగులు తీస్తున్నారు. ’బాహుబలి’ వంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్తున్నారు. తారక్‌, చరణ్‌ల అభిమానుల నాలుగేళ్ళ నిరీక్షణకు తెరవేస్తూ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో చరణ్‌, తారక్‌ల నటనకు విమర్శకుల సైతం జేజేలు కొడుతున్నారు. రాజమౌళి టేకింగ్‌, విజన్‌కు ప్రేక్షకులు, సినీప్రముఖులు ఫిదా అయిపోతున్నారు. పలువురు సినీప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించి నటినటులు, సాంకేతిక నిపులణులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

also read :-కెజిఎఫ్‌`2 ట్రైలర్‌ సూపర్

ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవి, నటులు అల్లుఅర్జున్‌, మహేష్‌బాబు దర్శకులు శంకర్‌, ప్రశాంత్‌ నీల్‌, సుకుమార్‌, రామ్‌ గోపాల్‌ వర్మలు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా జూ. ఎన్టీఆర్‌ ’ఆర్‌ఆర్‌ఆర్‌’ పై స్పందిస్తూ ఓ లేఖను విడుదల చేశాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌ అవుతుంది. తారక్‌ విడుదల చేసిన లేఖలో ’నా కెరీర్‌లో ల్యాండ్‌ మార్క్‌ సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్‌ను నిలిచిపోయే విధంగా చేసిన ప్రతిఒక్కరికీ నా కృతజ్ఞతలు. నాలోని బెస్ట్‌ ఇవ్వడానికి నన్ను ప్రేరేపిపించిన జక్కన్నకు ధన్యవాదాలు. చరణ్‌ నువ్వు లేకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ను ఊహించలేను.

also read :-ఏడాదికి రెండు సినిమాలు

నువ్వు లేకపోతే ఆర్‌ఆర్‌ఆర్‌ లేదు. అల్లూరి పాత్రకు నువ్వు సంపూర్ణ న్యాయం చేసావు. అల్లూరి పాత్రలేకపోతే భీమ్‌ పాత్ర అసంపూర్ణంగా ఉండేది. అజయ్‌ సర్‌తో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవం. కీరవాణి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ప్రాణం పోసారు అంటూ ఈ చిత్రంలోని ప్రతి టెక్నీషియన్‌కు ఎన్టీఆర్‌ కృతజ్ఞతలు తెలుపుతూ లేఖను విడుదల చేశాడు. అంతే కాకుండా భారతీయ సినిమా ఇప్పుడు నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం కేవలం భారతదేశంలోని అతి పెద్ద యాక్షన్‌ డ్రామా చిత్రం కాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద యాక్షన్‌ డ్రామా చిత్రం’ అని లేఖలో వెల్లడిరచాడు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్‌ అవుతుంది. చిత్రంలో చరణ్‌ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించగా. తారక్‌ భీమ్‌ పాత్రలో నటించాడు.