కామెడీ పండిరచబోతున్న రంగమ్మత్త
(సినిమా-విజయంన్యూస్)
యాంకర్‌గా అనసూయ భరద్వాజ్ సూపర్ సక్సెస్ అయింది. దాన్ని వెండితెరపై కూడా కొనసాగించే ప్రయత్నాలు సాగిస్తోంది. ఆ క్రమంలో ఆమె కెరీర్‌లో కొన్ని మంచి పాత్రలు పడ్డాయి. భాషతో సంబంధం లేకుండా ఆమె చేస్తున్న పాత్రలకు మంచి పేరొస్తోంది. అయితే ఇప్పుడు అనసూయ ట్రాక్ మార్చే పనిలో ఉందని సమాచారం అందుతోంది. ఇన్నాళ్లూ బుల్లితెర పై యాంకర్ గా కామెడీ స్కిట్స్‌కు పడీపడీ నవ్విన ఆమె.. ఓ చిత్రంతో కడుపుబ్బ నవ్వించబోతున్నట్టు తెలుస్తోంది. జయ శంకర్ అనే దర్శకుడు తెరకెక్కించబోతున్న ఓ సినిమాలో అనసూయ హిలేరియస్ కామెడీ పాత్ర చేయబోతోందట. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. కీలకపాత్రల్లో శ్రీనివాసరెడ్డి, చమ్మక్ చంద్రలు నటించబోతున్నారు.
also read;బాహుబలి`3 కోసం కసరత్తులు
లేడీ లీడ్ రోల్ ను అనసూయ చేయనుండడంతో ఈ సినిమాపై ఆసక్తినెలకొంది.
బుల్లితెర కామెడీ షోస్ లో అనసూయ నవ్వించే ప్రయత్నం చేసినప్పటికీ అంతగా వర్కవుట్ కాలేదు. ఈ సారి ఆమె కామెడీ ప్రేక్షకుల్ని అలరించబోతున్నట్టు టాక్. అనసూయ, ఇతర పాత్రధారులతో బ్రహ్మాండమైన కామెడీ వర్కవుట్ చేసినట్టు మేకర్స్ చెబుతున్నారు. అతి త్వరలో ఈ సినిమా ప్రకటన రాబోతోంది. ఇటీవల ’భీష్మ పర్వం’ మలయాళ చిత్రంతో బ్లా?క్ బస్టర్ కైవసం చేసుకున్న అనసూయ తమిళంలో కూడా ఓ సినిమాకి కమిట్ అయింది. అలాగే.. తెలుగులో పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మరి ఈ కామెడీ చిత్రంతో అనసూయ కెరీర్ ఎలాంటి మలుపు తిరగనుందో చూడాలి.