త్వరలో దుబాయ్ లో ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రచారం
(సినిమా-విజయంన్యూస్);-
’ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ దుబాయ్‌కు పయనమైంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ’ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాను ఈ నెల 25న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.
also read;-20న ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ‘మనఊరు-మన పోరు’ సభ
ఈ నేపథ్యంలో చిత్రబృందం శరవేగంగా ప్రమోషన్స్ జరుపుతోంది. దర్శకుడు రాజమౌళి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. క్రమంలో దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. 7 రోజుల్లో 9 నగరాలలో ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈ రోజు నుంచే మార్చి 23 వరకు దేశం మొత్తం చుట్టి వచ్చేందుకు బయలుదేరారు. తాజాగా రాజమౌళి బృందం దుబాయ్‌లో ల్యాండ్ అవబోతున్నట్లు సోషల్ విూడియా ద్వారా తెలియజేసింది. వెళ్లే మార్గంలో అంటూ రాజమౌళి ` ఎన్టీఆర్ ` రామ్ చరణ్ కలిసి ఉన్న ఓ లేటెస్ట్ వీడియోను ఇన్ట్సాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ విూడియాలో వైరల్‌గా మారింది.
?