Telugu News

అందమైన ప్రేమ కథ ‘రాధేశ్యామ్‌’

విజువల్‌ వండర్‌గా తీర్చిన దర్శకుడు

0

అందమైన ప్రేమ కథ ‘రాధేశ్యామ్‌’

== విజువల్‌ వండర్‌గా తీర్చిన దర్శకుడు

(సినిమా-విజయంన్యూస్);-

బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్‌ నటించిన మరో పాన్‌ ఇండియా చిత్రం ’రాధేశ్యామ్‌’. ఈ మూవీ కోసం రెబల్‌ స్టార్‌ అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారు. పీరియాడికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. దాదాపు నాలుగేళ్ల  పాటు షూటింగ్‌ జరుపుకుంది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచాయి.

also read :-పుతిన్‌కు మ‌రో షాక్‌… ఉక్రెయిన్‌లోని ర‌ష్య‌న్ల ఆస్తుల సీజ్

దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ’రాధేశ్యామ్‌’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ కోసం అబిమానులు క్యూ కట్టారు. రాధేశ్యామ్‌ కథంతా 1976 ప్రాంతంలో సాగుతుంది. విక్రమాదిత్య(ప్రభాస్‌) ఓ గొప్ప జ్యోతిష్కుడు. హస్తసాముద్రికంలో ఆయన అంచనాలు వందశాతం నిజమవుతుంటాయి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించబోతుందని ముందే చెప్పి.. ఇండియా నుంచి ఇటలీ వెళ్లిపోతాడు. తన చేతిలో ప్రేమ రేఖలు లేవని, లవ్‌ని కాకుండా ప్లటేషన్‌షిప్‌ని నమ్ముకుంటాడు. ఇలా కనిపించిన ప్రతి అమ్మాయితో ఎంజాయ్‌ చేసే విక్రమాదిత్య.. డాక్టర్‌ ప్రేరణ(పూజా హెగ్డే)తో మాత్రం తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ తన చేతిలో లవ్‌ లైన్స్‌ లేవని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేక పోతాడు. మరోవైపు ప్రేరణ  క్యాన్సర్‌తో బాధపడుతుంది. ఆమె రెండు నెలల కంటే ఎక్కువ కాలం బతకదని వైద్యులు చెప్తారు.

also read :-,బాధిత కుటుంబానికి అండగా నిలిచిన 2009 సర్కిల్ ఇన్స్పెక్టర్స్ బ్యాచ్

కానీ తాను జీవితాంతం బతుకుతుందని విక్రమాదిత్య చెప్తాడు. అది ఎలా సాధ్యం అవుతుంది? విధిని ఎదురించి తన ప్రేమని విక్రమాదిత్య గెలిపించుకోగలిగాడా? లేదా? అనేదే ఈ సినిమా కథ. తన రాత అనేది చేతుల్లో ఉండదు.. చేతల్లో ఉంటుందనే విషయాన్ని ఓ ప్రేమ కథతో మరోసారి ప్రపంచానికి గుర్తు చేశాడు దర్శకుడు రాధాకృష్ణ. ఓ అందమైన ప్రేమకథని గ్రాండ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. కథలో ఎలాంటి మలుపులు ఉండవు కానీ.. లొకేషన్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ మాత్రం ప్రేక్షకుడి మనసు దోచుకుంటాయి. ఇటలీలోని బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో కథ.. అలా సాగిపోతుంది. ప్రభాస్‌ గత సినిమాల మాదిరి ఫైట్‌ సీన్స్‌, మాస్‌ సాంగ్స్‌ గానీ ఈ చిత్రంలో ఉండవు. కానీ కథంతా హీరో, హీరోయిన్ల చుట్టే తిరుగుతుంది. మిగతా పాత్రలకు అంతగా స్క్రీన్‌ స్పేస్‌ లేదు. భాగ్యశ్రీ,  సచిన్‌ ఖేడ్‌కర్‌, జగపతిబాబు, జయరాం,మురళిశర్మ లాంటి సీనియర్‌ నటులు ఉన్నప్పటికీ.. వారంతా కథలో ఇలా వచ్చి అలా వెళ్లినట్లు అనిపిస్తుంది. ప్రేమ కథకు హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్టీ చాలా అవసరం. ఈ సినిమాలో ఆ కెమెస్టీ వర్కౌట్‌ అయినా.. అందుకు తగినట్లుగా బలమైన సీన్స్‌ లేకపోవడం మైనస్‌. ఫస్టాఫ్‌ అంతా స్లోగా సాగుతుంది.

also read :-నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం పట్ల కరీంనగర్ లో బీజేపీ శ్రేణుల సంబరాలు

యూరప్‌ అందాలపైనే దర్శకుడు ఎక్కువ శ్రద్దపెట్టినట్లు అనిపిస్తుంది. ట్రైన్‌ సీన్‌ ఆకట్టుకుంటుంది. అలాగే హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే డెత్‌ ప్రాక్టీస్‌ సీన్‌ నవ్విస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. కానీ ఆ ఆసక్తిని సినిమా ఎండిరగ్‌ వరకు కొనసాగించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సెకండాఫ్‌లో కూడా కథ రొటీన్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఓడ సీన్‌.. పలు ఇంటర్యూల్లో చిత్ర యూనిట్‌ చెప్పినట్లుగా మెస్మరైస్‌ చేయకపోయినా.. ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. మొత్తంగా పాన్‌ ఇండియా స్థాయిలో ఇమేజ్‌ ఉన్న ప్రభాస్‌.. ఇలాంటి కథను ఒప్పుకొని, చేయడం నిజంగా ఓ ప్రయోగమే. జోతిష్యుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్‌ ఒదిగిపోయాడు.

also read :-రిటైర్మెంట్‌పై ముందే చెప్పినా పట్టించుకోని కేరళ

మాస్‌ ఇమేజ్‌ని ఉన్న ప్రభాస్‌.. ఈ సినిమాలో చాలా క్లాస్‌గా కనిపించాడు. ఇక డాక్టర్‌ ప్రేరణగా పూజా హెగ్డే మెప్పించింది. వీరిద్దరి జోడి తెరపై అందంగా కనిపించింది. విక్రమాదిత్య గురువు పరమహంస పాత్రంలో కృష్ణంరాజు ఆకట్టుకున్నాడు. హీరో తల్లిగా భాగ్యశ్రీ నటించింది. అలాగే హీరోయిన్‌ పెదనాన్నగా సచిల్‌ ఖేడ్‌కర్‌, ఓడ కెప్టెన్‌గా జయరాం, బిజినెస్‌ మ్యాన్‌గా జగపతిబాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. అవసరానికి మించి విఎఫ్‌ఎక్స్‌ ను ఉపయోగించుకోవడంతో ప్రతి ఫ్రేమ్‌ ఓ విజువల్‌ వండర్‌ గా మారిపోయింది.