Telugu News

బాహుబలి`3 కోసం కసరత్తులు

సినిమా-విజయంన్యూస్

0

బాహుబలి`3 కోసం కసరత్తులు
(సినిమా-విజయంన్యూస్)
’బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడు రాజమౌళి. భారతదేశం గర్వించ దగ్గ దర్శకులలో ఈయన ముందువరుసలో ఉంటాడు. పోస్టర్‌పై ఈయన పేరు ఉంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తారు. ప్రేక్షకుడు ఎంత ఖర్చుపెట్టి టికెట్‌ కొనుక్కున్నా దానికి రెట్టింపు ఎంట్టంల్గªనమెంట్‌ ఈయన సినిమాలలో ఉంటుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సైతం ఈయన సినిమా వస్తుందంటే వాళ్ళ సినిమాలను నాలుగు నెలలు వాయిదా వేసుకోవాలి అంటూ వెల్లడిరచారు. ఇక ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహించిన ’ట్రిపుల్‌ ఆర్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.

also read;-గిరిజనుల ఆశాజ్యోతి మంత్రి అజయ్

ఈ క్రమంలో చిత్రం బృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి ఓ ఇంటర్వూలో పాల్గొన్నాడు. ఇంటర్వూలో యాంకర్‌ ’బాహుబలి పార్ట్‌`1’, పార్ట్‌2 రూపొందించారు.విూ నుంచి ’బాహుబలి పార్ట్‌`3’ ఎక్స్‌పర్ట్‌ చేయవచ్చా అని ప్రశ్నించగా దానికి ’రాజమౌళి తప్పకుండా ఉంటుంది. బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలను చూపించనున్నాం. ఇప్పటికే దీనిపై వర్క్‌ను కూడా స్టార్ట్‌ చేశాం. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా దీనికి రెడీగా ఉన్నాడు. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కంచడానికి టైం పట్టచ్చు కానీ త్వరలోనే దీని గురించి ఆసక్తికర వార్త రానుంది’ అని వెల్లడిరచాడు. దీంతో బాహుబలి ప్రియులు బాహుబలి పార్ట్‌3 కోసం వెయింటింగ్‌ అంటూ పోస్ట్‌ చేస్తూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

also read;=క్రిష్‌`4 సినిమా సీక్వెల్‌పై నెట్టింట్‌ హాల్ చల్
ఇక ’ట్రిపుల్‌ ఆర్‌’ చిత్రం అత్యంత గ్రాండ్‌గా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివీవీ ఎంట్టంల్గªనమెంట్స్‌ పతాకంపై డివీవీ దానయ్య భారీ బ్జడెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో
నటించాడు. ఆలియా భట్‌, ఒలీవియా మోర్రీస్‌ కథానాయికలుగా నటించారు