ఫిన్లాండ్ విహారంలో చరణ్ దంపతులు
(సినిమా-విజయంన్యూస్)
ప్రస్తుతం శంకర్ చిత్రంతో బిజీగా ఉన్నప్పటికీ చిన్నపాటి బ్రేక్ తీసుకొని ఫిన్‌ల్యాండ్ లోని మంచు పర్వతాల అంచుల్లో మెగా యంగ్కపుల్ రామ్‌చరణ్, ఉపాసన విహరిస్తున్నారు. ఇంతకు ముందు ఈ విహారానికి సంబంధించిన ఫోటోస్ ను షేర్ చేసిన ఈ కపుల్.. తాజాగా సోషల్ విూడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో.. ఎయిర్ పోర్ట్‌లో లగేజీ ట్రాలీపై ఆటలాడుతూ కనిపించారు. మంచు కొండల్లో తమ పెట్‌డాగ్స్ తో ఫోటోలు దిగారు. క్యాంప్ ్గªర్లో చలికాచుకుంటూ అక్కడ డిన్నర్ కానిస్తూ ఎంజాయ్ చేశారు. తన భార్యతో కలిసి చరణ్ చిలిపిగా అల్లరి చేయడం అభిమానులకు ఎంతో చూడ ముచ్చటగా అనిపిస్తోంది.
also read;-కామెడీ పండిరచబోతున్న రంగమ్మత్త
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ విూడియాలో తెగ వైరల్ అవుతోంది. భూవ్మిూదున్న అత్యంత ఆనంద ప్రదేశంలో చాలా ఆనందంగా ఉన్నాం అంటూ ఉపాసన పోస్ట్ ఆకట్టుకుంటోంది. అలాగే వీరితో పాటు మరో జంట కూడా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ’బెటర్ మెంటల్ హెల్త్ కోసం కపుల్ వెకేషన్’ అని ఉపాసన షేర్ చేసిన ఫోటోస్ , వీడియోస్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. చరణ్ తాజా చిత్రం ’ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మరో 11 రోజుల్లో థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. శంకర్ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది