Telugu News

వందకోట్ల క్లబ్‌లో చేరిన గంగూబాయి

సినిమా-విజయంన్యూస్

0

వందకోట్ల క్లబ్‌లో చేరిన గంగూబాయి
== బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ తాజాగా నటించి మెప్పించిన చిత్రం గంగూబాయి కతియవాడి.
(సినిమా-విజయంన్యూస్)
ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఇటీవలే ఈ చిత్రం అత్యధిక వసూళ్లతో భారతీయ బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్ల మార్క్‌ను దాటింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బాలీవుడ్‌కి అతిపెద్ద ఓపెనింగ్స్‌ ఇచ్చిన మూడో చిత్రం గంగూబాయి కతియవాడి. అయితే ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది అలియా భట్‌. అది ఎలా అంటే.. ఒక బర్గర్‌,  తింటూ ఎంజాయ్‌ చేసింది అలియా భట్‌. ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ తన ఇన్‌స్టా గ్రామ్‌ హ్యాండిల్‌లో గురువారం షేర్‌ చేసింది.

also read :-ఆర్టీసీ పరిరక్షణే లక్ష్యంగా సర్కార్ అడుగులేస్తోంది : మంత్రి పువ్వాడ

ఈ పోస్ట్‌లో ’100 కోట్ల మార్క్‌ దాటినందుకు శుభాకాంక్షలు గంగూబాయి అంటూ పోస్ట్‌ చేసింది. ఈ సినిమాలో అజయ్‌ దేవగన్‌, ఇమ్రాన్‌ హష్మి, హ్యూమా ఖురేషీ అతిథి పాత్రల్లో సందడి చేశారు. అయితే మాఫీయ క్వీన్‌, వేశ్య పాత్రలో అలియా తన అందం, అభినయం, డైలాగ్‌లతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఇప్పటివరకు గ్లామర్‌ రోల్స్‌తో అలరించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను ఆశ్చర్యపరిచింది.