ఈనెల 20న ‘సర్కారు వారి పాట’ మరో సాగ్ రిలీజ్
(సినిమా-విజయంన్యూస్);-
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు పరశురామ్ తొలి కలయికలో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ’సర్కారువారి పాట’లో కీర్తిసురేశ్ కథానాయికగా నటిస్తోంది. బ్యాంకింగ్ రంగంలోని అతి పెద్ద కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులోని మహేశ్ బాబు మేకోవర్ ’పోకిరి, అతిథి’ చిత్రాల్ని గుర్తుకు తెస్తుండడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. సినిమాలోని చాలా భాగం విదేశాల్లోనే చిత్రీకరించారు.
also read :-ట్రిపుల్‌ఆర్ సినిమాకు హోలి దమాకా
అలాగే.. పలు పాటల షూట్ కూడా అక్కడే జరిగింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ ఒక టీజర్, కళావతి అనే సింగిల్ విడుదలయ్యాయి. ఈ రెండిరటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని రెండో సింగిల్ కూడా విడుదల కానుంది. అన్నట్టుగానే ఈ నెల 20న సెకండ్ సింగిల్ ను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ గురువారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. పెన్నీ సాంగ్ పేరుతో విడుదల కానుంది సెకండ్ సింగిల్. అంటే ఒక రకంగా ఇది ఈ సినిమా టైటిల్ సాంగ్ అనుకోవచ్చు. డబ్బు నేపథ్యంలో పాట ఉంటుందని అర్దమవుతోంది.
తమన్ క్యాచీ ట్యూన్ తో ఈ పాట మరో చార్ట్ బస్టర్ అవుతుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా చిత్రీకరణ ఆల్మోస్ట్ చివరిదశకు చేరుకుంది. ’సరిలేరు నీకెవ్వురు’ బ్లాక్ బస్టర్ తర్వాత మహేశ్ నటిస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ సింగిల్ కళావతికి రికార్డు వ్యూస్ వచ్చాయి. మరి సెకండ్ సింగిల్ కు అంతకు మించిన వ్యూస్ దక్కుతాయేమో చూడాలి.