ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు
== తెలుగు సినీ పరిశ్రమకు అండగా కేసిఆర్
== మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ తోపాటు ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సినీ అగ్ర కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. పురాణ విప్లవకారులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవిత కల్పిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఘన విజయం సాధించి ప్రేక్షకుల మన్ననలు పొందాలని మంత్రి ఆకాంక్షించారు. ఎనిమిదేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సుస్థిరమైన కేంద్రంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు.
also read :- చింతగుఫాలో పుడ్ పాయిజన్..28మంది కి అస్వస్థత
also read :- దళితులకు దక్కిన ఆ భూమి
ఆర్అర్అర్ సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకునేలా సీఎం కేసిఆర్ నేతృత్వంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. ఈ చిత్రం విడుదలైన మూడు రోజులు వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, తర్వాత వారం రోజులు రూ.50, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ.50, ఆ తర్వాత వారం రోజుల పాటు రూ.30 పెంచుకునే అవకాశం కల్పించిందని చెప్పారు ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలైన పది రోజుల వరకు రోజుకు 5 షోలు వేసుకునే వెసలుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించిన విషయం మంత్రి అజయ్ గుర్తుచేశారు.