Telugu News

ఇంద్రజకు జాక్ పాట్..? పుష్ప-2లో చాన్స్..?

సినిమా-విజయంన్యూస్

0

ఇంద్రజకు జాక్ పాట్..? పుష్ప-2లో చాన్స్..?
(సినిమా-విజయంన్యూస్);-
అలనాటి తారలు వరసగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్‌ వెండితెర ఏలిన స్టార్‌ హీరోయిన్లు తల్లి పాత్రలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రాధిక, ఖుష్భు, ఆమని వంటి నటీమణులు రీఎంట్రీ ఇవ్వగా.. ఇటీవల రాధేశ్యామ్‌ వంటి పాన్‌ ఇండియా మూవీతో బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో స్టార్‌ హీరో ప్రాజెక్ట్స్‌ సీనియర్‌ నటీమణులు ఎంట్రీ ఇవ్వడం ట్రెండ్‌గా మారింది. తాజాగా 90ల్లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి ఇంద్రజ కూడా వెండితెర ఎంట్రీకి రెడీ అయ్యింది. ఇప్పటికే బుల్లితెరపై అలరిస్తున్న ఆమె ’స్టాండప్‌ రాహుల్‌’ మూవీతో బిగ్‌స్క్రీన్‌పై సందడి చేయబోతోంది.

also read;-గని’ ట్రైలర్‌ విడుదల.. వరుణ్ తేజ్ హీరో..

ఈ మూవీలో రాజ్‌ తరుణ్‌కు ఇంద్రజ తల్లి పాత్రలో నటించనుంది. ఇదిలా ఉంటే ఇప్పడు ఆమెకు పాన్‌ ఇండియా ఆఫర్‌ వచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఫస్ట్‌ పార్ట్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న ’పుష్ప: ది రైజ్‌’.. ప్రస్తుతం పార్ట్‌ 2ను రూపొందుతోంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా లీడ్‌ రోల్‌లు పోషిస్తున్నారు.ప్రస్తుతం పుష్ప పార్ట్‌2 రూపొందించే బిజీలో అల్లు అర్జున్‌, సుక్కు ఉన్నారు.

also read;-గౌరవ వేతనం పెంపుతో54,201 మందికి లబ్ది

ఇందులో ఓ కీలక పాత్ర కోసం సుక్కు ఇంద్రజ స్పందించారట. ’పుష్ప’ సినిమాలో ఉన్న నటీనటులే పుష్ప 2 లో ఉంటారని గతంలో సుకుమార్‌ క్లారిటీ ఇవ్వగా.. ఇప్పుడు కథలో కొన్ని మార్పులు చేసి, అందుకు తగ్గట్టే పాత్రలను ఎంచుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో ఓ కీ రోల్‌ కోసం ఇంద్రజ సుక్కు చర్చలు జరిపాడట, దీనికి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు ప్రస్తుతం ఫిలిం దూనియాలో ఈ వార్త గుప్పు మంటోంది. ఇక ఇదే కనుక నిజమైతే ఇంద్రజ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.