Telugu News

కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతి..ఎలాగంటే..?

గుండెపోటుతో మృతి.. ** కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ

0

కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతి..
** గుండెపోటుతో మృతి..
** కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ
** ఆసుపత్రికి బయలుదేరిన సీఎం, మాజీ సీఎంలు.
(కర్నాటక-విజయం న్యూస్)

కన్నడ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(46)  అకాల మృతి చెందరు. శుక్రవారం ఇంట్లో ఉదయం జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.. చికిత్స పొందుతున్న పునిత్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలనటుడిగా పనిచేసి‌, అతి తక్కువ కాలంలోనే పెద్ద హీరోగా ఎదిగిన పునీత్ పవర్ స్టార్ గా గుర్తింపు పొందారు. 29సినిమా ల్లో హీరోగా పనిచేసిన పునీత్..  ఆయన తెలుగు స్టార్ ఎన్ టీఆర్ అభిమాని.. ఆయన సినిమాలో ఒక పాట పాడించుకున్న పునీత్.. పునీత్ మరణంతో కన్నడ రాష్ట్రంలో విషాదషాయలు అలుముకున్నాయి.. కన్నడ సీఎం, మాజీ సీఎంలు, రాజకీయ నాయకులు సిని నటులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. పునీత్ మరణంతో కర్నాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. పూర్తిగా సెలవు ప్రకటించి.. 144సెక్షన్ అమలు చేసింది.. పోలీసులు బారీగా బందోబస్తు నిర్వహించారు..

Also read:- భట్టి, కమళరాజ్ మధ్య మాటల యుద్ద..సమావేశంలో ఉదృక్తత