కెజిఎఫ్`2 ట్రైలర్ సూపర్
== అనూహ్య స్పందిస్తున్న అభిమానులు
(సినిమా-విజయంన్యూస్)
విడుదల తరవాత సంచలనం సృష్టించిన సౌత్ సినిమా ’కేజీఎఫ్’. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. సౌత్ నుంచి నార్త్ వరకు ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత కేజీఎఫ్ సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతేడాది విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో అత్యధికంగా వ్యూస్‌ను సాధించిన టీజర్‌గా రికార్డు సృష్టించింది.
also read;-అమెరికా సదస్సులో కూసుమంచి మండల యువకుడి అద్భుత స్పీచ్
దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగా ఆసక్తి చూపుతున్నారో అని. ఇక తాజాగా విడుదలైన చాప్టర్`2 ట్రైలర్ కూడా టీజర్ తరహాలోనే యూట్యుబ్‌లో రికార్డులు సృష్టిస్తుంది. ఆదివారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ 24గంటల్లో 109 మిలియన్ల వ్యూస్‌ను సాధించి యూట్యుబ్‌లో ప్రభంజనం సృష్టిస్తుంది.
also read :-యాదాద్రి మీద ఉన్న శ్రద్ధ రామయ్య మీద లేదా….
ఇండియాలోనే ఇంత ఫాస్ట్‌గా అత్యధిక వ్యూస్‌ను సాధించిన ట్రైలర్‌గా చాప్టర్`2 ట్రైలర్ రికార్డు సృష్టించింది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర మేకర్స్ సోషల్ విూడియాలో ’రికార్డ్స్..రికార్డ్స్..రికార్డ్స్.. రాఖీకి ఇది ఇష్టముండదు. కానీ రాఖీని రికార్డ్స్ ఇష్టపడ తాయి’అంటూ మేకర్స్ సినిమాలోని డైలాగ్‌తో రికార్డ్స్‌ను వర్ణించారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని హళంబలే సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది.