Telugu News

‘‘కేజీయఫ్‌ 2’’ పైసా వసూళ్

== సెన్సేషన్‌.. 7 రోజుల్లో 700 కోట్లు.!

0

‘‘కేజీయఫ్‌ 2’’ పైసా వసూళ్

== సెన్సేషన్‌.. 7 రోజుల్లో 700 కోట్లు.!

(విజయం-సినిమా న్యూస్);-
కేజీఎఫ్2 పైసా వసూళ్లలో దుమ్మురేపుతోంది. బహుబలి సినిమాకు వచ్చిన వసూళ్ల రికార్డును బద్దలుకొట్టింది.. 7రోజుల్లోనే 700 కోట్లను వసూళ్లు చేసింది.. మళ్ళీ ఇండియన్‌ సినిమా దగ్గర ఒక సీక్వెల్‌ కోసం బాహుబలి 2 తర్వాత అంత ఆసక్తిగా అంతా ఎదురు చూసిన సినిమా కన్నడ రాకింగ్‌ స్టార్‌ యష్‌ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌ గా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తీసిన ఈ ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇండియన్‌ సినిమా దగ్గర ఒక బెస్ట్‌ యాక్షన్‌ ఫ్రాంచైజ్‌ చిత్రంగా నిలిచింది.

also read :-దేశంలో ఒడివడిగా పెరుగుతున్న కరోనా కేసులు

అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలకి తగ్గట్టుగానే సాలిడ్‌ ఓపెనింగ్స్‌ ఈ సినిమాకి దక్కగా..ఇప్పుడు ఈ సినిమా 7 రోజుల్లో ఏకంగా 700 కోట్ల గ్రాస్‌ క్లబ్‌ లో చేరినట్టు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు 700 కోట్లకి చేరుకుని మొదటి వారానికి గాను ఇండియన్‌ సినిమా దగ్గర రెండో హైయెస్ట్‌ సినిమాగా నిలిచినట్టు తెలుస్తుంది. మొదటి సినిమాగా బాహుబలి 2 సినిమానే ఉండగా ఈ సినిమా రెండో స్థానంలో నిలిచింది. అలాగే ఈ సినిమాకి అటు కన్నడలో సమానంగా మన తెలుగులో కూడా వసూళ్లు వస్తుండడం గమనార్హం, కాగా హిందీలో సాలిడ్‌ రన్‌ ని ఈ చిత్రం కనబరుస్తుంది.