‘‘ఆచార్య’’లో మహేష్ బాబు…?
== సూపర్ స్టార్ వాయిస్ ఓవర్ చేస్తన్నట్లుగా ప్రచారం .?
(విజయం సినిమా న్యూస్);-
ఆచార్య.. ఖైదీ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాపై ప్రజలకు అంచనాలు భారీగానే ఉన్నాయి.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ భారీ సినిమా ‘‘ఆచార్య’’ కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కి మరికొన్ని రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉండగా మేకర్స్ రిలీజ్ పనుల్లో ఉన్నారు.మరి ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఒక క్రేజీ బజ్ వినిపిస్తుంది.
also read :-‘‘కేజీయఫ్ 2’’ పైసా వసూళ్
ఈ సినిమాకి గాను మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ ని అందిస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఇది వరకే మహేష్ బాబు పలు సినిమాలకి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి తాను కథను ఎలా ముందుకు నడిపిస్తారో చూడాలి. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ సినిమాలో కాజల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.