Telugu News

గని’ ట్రైలర్‌ విడుదల.. వరుణ్ తేజ్ హీరో..

సినిమా-విజయంన్యూస్

0

గని’ ట్రైలర్‌ విడుదల.. వరుణ్ తేజ్ హీరో..
(సినిమా-విజయంన్యూస్)
మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ’గని’ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. దీనిలో భాగంగా చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. ఇందులో వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించగా బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ సాయీ మంజ్రేకర్‌ వరుణ్‌ సరసన హీరోయిన్‌గా నటించింది.

also read;-ఈనెల 20న ‘సర్కారు వారి పాట’ మరో సాగ్ రిలీజ్

అల్లు అరవింద్‌ సమర్పణలో రినైసెన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై అల్లు బాబి, సిద్దూ ముద్ద కలిసి నిర్మిస్తున్నారు. కాగా, ఈ మధ్య ’గని’ సినిమా బయోపిక్‌గా రూపొందుతుందనే వార్తలు వచ్చాయి. దానికి తాజాగా ట్రైలర్‌ ఈవెంట్‌లో హీరో వరుణ్‌ తేజ్‌ క్లారిటీ ఇచ్చారు. సినిమా ఎవరి బయోపిక్‌గా తెరకెక్కలేదని, తల్లి సెంటిమెంట్‌ ఆధారంగా రూపొందినట్టు తెలిపారు. అలాగే, జనాలకి నచ్చితే అదే మాస్‌ సినిమా అని.. కొవిడ్‌ బాగా హెల్ప్‌ చేసింది.. ఈ సినిమా వల్ల నాకు చాలా డిసిప్లిన్‌ వచ్చింది.. అని వరుణ్‌ తెలిపాడు. ఇక ఈ సినిమాలో మరో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సునీల్‌ శెట్టి, జగపతిబాబు నవీన్‌ చంద్ర, ఉపేంద్ర, నదియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేయబోతోంది. ఎస్‌ ఎస్‌ థమన్‌ సంగీత దర్శకుడు. ఏప్రిల్‌ 8వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్‌ చేయబోతున్నారు. కాగా తాజాగా విడలైన గని థియేట్రికల్‌ ట్రైలర్‌ బాగా ఆకట్టుకుంటోంది.