Telugu News

మేకప్‌ మెన్ గా ఆమిర్ ఖాన్..ఎవరికోసమో తెలుసా?

విజయం-సినిమాన్యూస్

0

మేకప్‌ మెన్ గా ఆమిర్ ఖాన్..ఎవరికోసమో తెలుసా?

(విజయం-సినిమాన్యూస్);-

అయినవారి కోసం.. నచ్చిన వారికోసం ఎంతటివారైనా మెట్టు దిగి కొత్త అవతారం ఎత్తడం సహాజమే.. అదే తరహాలో బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ కొత్త అవతారం ఎత్తాడు.. ఒకరి కోసం మేకప్‌మెన్‌గా మారిపోయాడు. ఎందుకు? ఎవరికోసం? అనుకుంటున్నారా? తన ముద్దుల కూతురు ఇరా కోసం! ఈ విషయాన్ని స్వయంగా ఇరానే వెల్లడిరచింది. ‘నాకు మేకప్‌ ఎవరు వేశారో తెలుసా? ఇంకెవరు మా నాన్నే. నాకంటే బాగా మేకప్‌ వేస్తానని చెప్పాడు. చివరకు ఆ మాటను నిజం చేసి చూపించాడు. ఎవరికైనా యూట్యూబ్‌ ట్యుటోరియల్స్‌ కావాలా?’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రితో దిగిన ఫొటోలను పోస్ట్‌ చేసింది.

also read :-అమీషాపటేల్‌ పై చీటింగ్‌ కేసు.. ఎందుకు..?

ఆమిర్‌ తన ముఖానికి మేకప్‌ వేస్తే ఇరా మాత్రం ఆమిర్‌ తలకు హెయిర్‌ బ్యాండ్‌ పెట్టి నవ్వేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీరి అనుబంధాన్ని చూసిన ఫ్యాన్స్‌ ఆమిర్‌ ఉత్తమ తండ్రి, లవ్‌ యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమిర్‌ నటించిన తాజా చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. ఫారెస్ట్‌ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో కరీనా కపూర్‌, నాగచైత్య, అద్వైత్‌ చందన్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.