‘‘ఆచార్య’’ కొరటాల సంచలన ప్రకటన
(విజయం-సినిమాన్యూస్);-
ఒక వైపు బిగెస్ట్ సినిమాల డైరెక్టర్.. మరో వైపు మెగస్టార్.. ఇద్దరి కలియకలో వచ్చే బ్లాక్ బాస్టర్ మూవి ఆచార్య.. ఈ సినిమాపై దర్శకుడు కొరటాల సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాలు ఏ స్థాయిలో రాణిస్తున్నాయో చూస్తూనే ఉన్నాము.
ఒకదాన్ని మించి మరొక సినిమా వెళ్లి పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతున్నాయి. మరి అందులో భాగంగా చాలా వరకు సినిమాలు మొదట తెలుగులోనే ప్లాన్ చేసి స్టార్ట్ చెయ్యగా తర్వాత తర్వాత అవి పాన్ ఇండియా రిలీజ్ గా మారినవి కూడా ఉన్నాయి.మరి ఇదిలా ఉండగా లేటెస్ట్ భారీ సినిమా ‘‘ఆచార్య’’ పై కూడా పాన్ ఇండియా రిలీజ్ మాటలు వినిపించాయి. అయితే వీటిపై దర్శకుడు కొరటాల శివ ఒక క్లుప్తమైన క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాని మొదటి నుంచి తెలుగుకి సంబంధించిన సినిమాగానే తియ్యాలి అనుకున్నామని కానీ తర్వాత సమీకరణాలు మారడంతో పాన్ ఇండియా రిలీజ్ చర్చలు అయితే వచ్చాయి.
also read :-మేకప్ మెన్ గా ఆమిర్ ఖాన్..ఎవరికోసమో తెలుసా?
అది నిజమే కానీ తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కాస్త గజిబిజి క్రేజ్ ని క్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదనే ఉద్దేశంలో ఇప్పుడే పాన్ ఇండియా రిలీజ్ పని లేదని భావించి వద్దనుకున్నాం అని తెలిపారు. మరి ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ రామ్ చరణ్ లు హీరోలుగా నటించగా ఏప్రిల్ 29న భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.