Telugu News

కృతి శెట్టి కోరిక తీరేదెప్పుడో..?

విజయం-సినిమా న్యూస్

0

కృతి శెట్టి కోరిక తీరేదెప్పుడో..?

(విజయం-సినిమా న్యూస్);-
ఆమె చాలా పెద్ద స్టార్.. మూడు సినిమాలతోనే అతిపెద్ద స్టార్ హీరియిన్ గా టాలీవుడ్ లో పేరుతెచ్చుకుంది. అయినప్పటికి ఒక కోరిక మిగిలిపోయిందంటా..? అదేమిటంటే..? ‘ఉప్పెన’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘బంగర్రాజు’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది అందాల తార కృతి శెట్టి. చూస్తుండగానే అగ్ర నాయికగా పేరు తెచ్చుకుంది. తొలి సినిమా లాక్‌ డౌన్‌ భయాలనూ ఎదుర్కొని ఘన విజయాన్ని సాధించింది. దీంతో అరంగేట్రంతోనే వెనుదిరిగి చూడాల్సిన పనిలేకుండా పోయిందీ భామకు. పరస్పరం భిన్నమైన క్యారెక్టర్‌లు లభించడం వల్లే తను నాయికగా పేరు తెచ్చుకున్నానని అంటున్నదీ తార. కృతి శెట్టి మాట్లాడుతూ ‘నేను ఇప్పటిదాకా చేసిన చిత్రాలన్నింటిలో వేటికవి భిన్నమైన క్యారెక్టర్స్‌ లభించాయి.

also read :-ఆచార్య’’ కొరటాల సంచలన ప్రకటన

దీంతో ప్రేక్షకులకు నేను ప్రతిసారీ కొత్తగా కనిపిస్తున్నా. దగ్గరకొచ్చే కథల్లో గత చిత్రాలను పోలినవి, మూసగా అనిపించినవి వద్దని చెప్పేస్తా. నటిగా సవాలు విసిరే సినిమాల్లో నటించాలని ఉంది. త్వరలో సొంత డబ్బింగ్‌ చెప్పుకోవాలనీ ప్రయత్నిస్తున్నా. రాకుమారి పాత్రలో నటించాలన్నది నా కోరిక. అది ఎప్పటికి తీరుతుందో చూడాలి’ అని చెప్పింది. ప్రస్తుతం కృతి శెట్టి సుధీర్‌ బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’, రామ్‌ సరసన ‘ద వారియర్‌’ చిత్రాల్లో నటిస్తున్నది.