అమీషాపటేల్ పై చీటింగ్ కేసు.. ఎందుకు..?
(విజయం-సినిమా న్యూస్);-
బాలీవుడ్ నటి అమీషాపటేల్ పై కేసు నమోదైంది..? ఎందుకంటే..? మధ్య ప్రదేశ్ లో చీటింగ్ కేసు నమోదైంది. డబ్బులు తీసుకుని మోసం చేసిందని ఓ ఈవెంట్ ఆర్గనైజర్లు ఎంపీ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో అమీషాపై కేసు ఫైల్ అయినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..ఇటీవల మధ్యప్రదేశ్ లో ని ఖాండ్వాలో ఓ కార్యక్రమం కోసం ఈవెంట్ అర్గనైజర్లు అమీషాని సంప్రదించారు.ఈవెంట్ లో గంట పాటు పాల్గొనుకుందేకు అమీషాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. అందుకు కొంత పారితోషికంతో అగ్రిమెంట్ చేసుకున్నారు.మొత్తం పేమెంట్ ముందుగానే అమీషాకి చెల్లించారు. అయితే అమీషా మాత్రం స్టేజ్ పై కేవలం పదినిమిషాలు కాలక్షేపం చేసేసి వెళ్లియిందిట.
also read;-రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 3,289 కోట్ల ఫీజు
దీంతో ఆమెపై ఈవెంట్ మేనేజర్ చీటింగ్ కేసు పెట్టాడు.ఈ నేపథ్యంలో వివాదంపై అమీషా స్పందించింది. ‘’ఏప్రిల్ 23న ఈవెంట్కి వెళ్లిన మాట వాస్తవం. సిటీలోని నవచండి ఉత్సవాలకు హాజరయ్యాను. కానీ స్టార్ ప్లష్ ఎంటర్ టైన్ మెంట్స్- అరవింద్ పాండే ఈ కార్యక్రమాన్ని చెత్తగా నిర్వహించారు. ఈవెంట్ లో నిర్వహణ లోపాలున్నాయి. కనీసం నాకు భద్రత కూడా కల్పించలేకపోయారు. దీంతో నాకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు.చాలా భయమేసింది.
also read;-ఇంటర్, పది పరీక్షలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిచండి
ఆ సమయంలో స్థానిక పోలీసులు రక్షణ కల్పించారు. అందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇలాంటి ఈవెంట్లకి హాజరవ్వడం నాకు కొత్తేం కాదు. తరుచూ వెళ్తుంటాను. నిర్వహకులు ఎంతో బాగా చూసుకుంటారు.కానీ వీళ్లు మాత్రం భద్రత కల్పించడంతో విఫలమయ్యారు. వేదికపై గంట సేపు ఉన్నాను. నన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో పోలీసుల సహాయంతో నెమ్మదిగా కారెక్కి వెళ్లిపోయాను’అని తెలిపింది.