Telugu News

మల్టీస్టార్‌ అంటే వెంకటేష్‌

సీనియర్, జూనియర్ అనే బేదం లేకుండా నటిస్తున్న హీరో

0

మల్టీస్టార్‌ అంటే వెంకటేష్‌

== సీనియర్, జూనియర్ అనే బేదం లేకుండా నటిస్తున్న హీరో

(సినిమా-విజయంన్యూస్)
గతంలో సినిమాలంటే ఎక్కువ భాగం మల్టీస్టారర్ సినిమాలే ఉండేవి.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ లాంటి మహామహా నటులు మల్టీస్టార్‌ సినిమాలు తీసేవారు. ప్రజలను మెప్పించేవారు. సూపర్బ్‌ క్రేజ్‌ ఉండేది కూడా. తర్వాత ఇద్దరు స్టార్‌ హీరోలు కలిసి నటించడం తగ్గిపోయింది. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత మల్టీస్టారర్స్‌కి క్రేజ్‌ ఏర్పడిందనే చెప్పాలి. అందుకు ప్రధాన కారణం వెంకటేష్‌ అని చెప్పొచ్చు. మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌, వరుణ్‌ తేజ్‌ లాంటి హీరోలతో కలిసి నటిస్తూ మరోసారి మల్టీస్టారర్స్‌ ట్రెండ్‌ని తీసుకొచ్చారాయన.

also read;-నా జీవితంలో బెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్

చాలా పెద్ద హీరో అయినప్పటికి చిన్నవారితో కూడా కలిసి పనిచేస్తూ సినిమా జీవితాన్నే మార్చేశారని చెప్పాలి. ఇప్పటికే వరుణ్‌ తేజ్‌తో కలిసి ’ఎఫ్‌ 3’ చేస్తున్నాడు. ఇప్పుడు మరో హీరోతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నట్లు తెలిసింది. తమిళ హీరో శివకార్తికేయన్‌ టాలీవుడ్‌లో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ’జాతిరత్నాలు’ ఫేమ్‌ అనుదీప్‌ దర్శకత్వంలో నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌, సురేష్‌ బాబు, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

also read;-సినిమా షూటింగ్ లో పవన్ బిజీబిజీ

ఉక్రెయిన్‌ నటి మారియా హీరోయిన్‌గా నటిస్తోంది. లండన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో వెంకటేష్‌ ఒక ఇంపాంర్టెంట్‌ రోల్‌లో కనిపించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయన ఆ సినిమాలో నటించట్లేదని, అనుదీప్‌ డైరెక్షన్‌లోనే వేరే మూవీ చేయబోతున్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. వెంకీ అనుదీప్‌ డైరెక్షన్‌లో నటించనున్నారనే వార్త మాత్రం నిజమని అర్థమవుతోంది.