మెగా డాటర్ నిహారిక కొణిదెల భర్త చైతన్య జొన్నలగడ్డ నివసించే అపార్ట్మెంట్లో జరిగిన గొడవ
విజయం డైలీ
మెగా డాటర్ నిహారిక కొణిదెల భర్త చైతన్య జొన్నలగడ్డ నివసించే అపార్ట్మెంట్లో జరిగిన గొడవ తెలుగు మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
చిన్నపాటి ఘర్షణ గొడవగా మారడం ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుకోవడం మీడియాలో రచ్చగా మారింది.
అయితే నిహారిక భర్త చైతన్య అపార్ట్మెంట్ వాసుల మధ్య జరిగిన గొడవపై పోలీసులు దర్యాప్తు చేయగా బయటకు వచ్చిన పలు విషయాలు ఏమిటంటే…
చైతన్య జొన్నలగడ్డ అాపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదులు స్వీకరించిన బంజారా హిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షులను అడిగి అక్కడ గొడవ గురించి అడిగి తెలుసుకొన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో జరిగిన గొడవను పరిశీలించారు. ఈ కేసులో తప్పు ఎవరిదనే కోణంలో పోలీసులు విచారించారు.
ఇంకా కేసు దర్యాప్తు సమయంలో పలు విషయాలను పోలీసుల గోప్యంగా ఉంచారు
ఫిర్యాదులపై విచారణ అపార్ట్మెంట్లో చైతన్య నివాసితులకు జరిగిన గొడవకు సంబంధించిన వ్యవహారంపై పోలీసులు ఆరా తీశారు. ఈ కేసులో వాస్తవాన్ని బయటకు లాగేందుకు బంజారా హిల్స్ ఫోలీసులు దర్యాప్తు చేశారు.
అపార్ట్మెంట్లో ఉంటున్న ఏడుగురు రెసిడెంట్స్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తూ.. వారిని కూడా విచారించారు. వాస్తవాల ఆధారంగా గొడవకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని భావించినప్పటికీ.. సమాచార లోపం వల్ల గొడవ జరిగిందనేది గ్రహించారు.