జోస్ మీదున్న పూజా హెగ్డే
(హైదరాబాద్-విజయంన్యూస్)
వరుస హిట్‌లందుకుంటూ మంచి జోష్ మీదుంది హీరోయిన్ పూజా హెగ్డే. క్షణం తీరిక లేకుండా షూటింగుల్లో పాల్గొంటున్న పూజా కెరీర్ ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. తనుంటే సినిమా హిట్ అనేంతలా పేరు తెచ్చుకుందీ బుట్టబొమ్మ. పేరుతో పాటు డబ్బులు కూడా బాగానే సంపాదించింది. ఈ మధ్యే ముంబైలో ఇల్లు కట్టుకున్న పూజా తాజాగా గృహప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫొటో పోస్ట్ చేసింది.
also read :-వృద్ధ దంపతులపై గొడ్డలితో దాడి
ఇందులో సంప్రదాయ దుస్తులు ధరించిన హీరోయిన్ చేతిలో కొబ్బరికాయను పట్టుకుని కూర్చుంది. ’ఇల్లు కట్టుకోవాలన్న నా కల నెరవేరింది. విూరు విూ అంతరాత్మను, శ్రమను నమ్ముతూ ఉండండి.. ఈ ప్రపంచమే విూతో ప్రేమలో పడుతుంది’ అని రాసుకొచ్చింది. కాగా పూజా హెగ్డే ’ఒక లైలా’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ’ముకుందా’ చిత్రంతో అందరినీ బుట్టలో వేసుకుంది. ఆచితూచి పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించిన ఈ భామ ’అల వైకుంఠపురములో’ సినిమాతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటీవల ’మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో కనిపించిన ఆమె ప్రస్తుతం ’బీస్ట్’, ’ఆచార్య’, ’రాధేశ్యామ్’ సినిమాలు చేస్తోంది.