ప్రభాస్ బిజిబిజీ..
== వరస సినిమాలతో సెట్ లో గడుపుతున్న ప్రబాస్
(విజయంసినిమా న్యూస్);-
తెలుగు సినిజీవితానికే వెలుగు తీసుకొచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ బొలేడన్ని సినిమాలతో బిజిబిజీగా మారిపోయాడు. ’రాధేశ్యామ్’ చిత్రంలో లవర్ బాయ్‌గా కనిపించిన ప్రభాస్ ఈ ఏడాది మరో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సాలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ వంటి ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు మారుతి దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఇది హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎలిమెంట్స్ లేకపోవడంతో వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడట ప్రభాస్.
also read :-రాధేశ్యామ్ ఫెయిల్యూర్‌పై పూజాహెగ్డే నిర్వేదం
కేవలం రెండు షెడ్యూల్స్‌లోనే మొత్తం షూటింగ్ కంప్లీట్ చేయాలని కోరాడట. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఈ యేడు ఆఖరికల్లా రిలీజ్ చేసేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ’సాహో’ తర్వాత మూడేళ్ల గ్యాప్‌తో ’రాధేశ్యామ్’ రిలీజయింది. దీంతో ఈ ఏడాది కచ్చితంగా తనవి రెండు సినిమాలైనా విడుదల అవుతాయనుకున్నాడు ప్రభాస్. కానీ ’ఆది పురుష్’ వచ్చేయేడుకి వాయిదా పడిరది. సాలార్ కూడా క్లారిటీ లేకపోవడంతో మారుతి మూవీతో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేయాలనుకుంటున్నాడట. ఇదిలా ఉంటే ’సాలార్’ షూటింగ్‌లో గాయపడిన ప్రభాస్ ఓ మైనర్ సర్జరీ కోసం స్పెయిన్ వెళ్లాడు. తిరిగి రాగానే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ షూటింగ్స్‌తో బిజీ అవనున్నాడు.
please subscribe this chanel smiling chaithu