ప్రభాస్ సినిమా అంటే యమక్రేజీ
==ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అధారణ
== ఆయనతో సినిమాకు క్యూ కడుతున్న నిర్మాతలు
(సినిమా-విజయంన్యూస్);-
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. బాలీవుడ్‌లో స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు ప్రభాస్‌కు కూడా ఏర్పడిరది. ఈయన నుంచి సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులే కాదు.. హిందీ ప్రేక్షకులు కూడా ఎదరుచూస్తుంటారు. దర్శక నిర్మాతలు కూడా భారీ కథతోనే ప్రభాస్ దగ్గరకు వెళ్తున్నారు. బడ్జెట్ ఎంతైనా సరే పెట్టడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈయన పారితోషికం విషయంలో కూడా నిర్మాతలు వెనకడుగు వేయడం లేదు. ప్రభాస్ కథ ఒప్పుకుంటే చాలు పారితోషికం ఎంతైనా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టుగా ప్రభాస్ రికార్డు దక్కించు కున్నాడు.
also read;-ఇంద్రజకు జాక్ పాట్..? పుష్ప-2లో చాన్స్..?
ఈయన ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను తీసుకుంటున్నట్లు ప్రచారం. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. లేటెస్ట్‌గా అందుతున్న సమాచారం ప్రకారం మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న హార్రర్ కామెడీ చిత్రానికి ప్రభాస్ దాదాపు 75కోట్ల పారితోషికాన్ని తీసుకోనున్నట్లు టాక్. ప్రభాస్ ఈ చిత్రానికి 60రోజుల కాల్షీట్లు ఇచ్చినట్లు సమాచారం. అంటే ప్రభాస్ రోజుకు 1.25 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటున్నాడు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో ముగ్గరు హీరోయిన్లు నటించనున్నారు.
also read;-కశ్మీర్ ఫైల్స్’ చిత్రంకు పైసా వసూల్
ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ’రాధేశ్యామ్’. మార్చి11న విడుదలైన ఈ చిత్రం మిక్డ్స్ టాక్‌ను తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. పిరీయాడికల్ లవ్‌స్టోరిగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇక ప్రభాస్ నటించిన ’ఆదిపురుష్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. దీంతో పాటుగా ’సలార్’ , ’ప్రాజెక్ట్`ఐ’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ’స్పిరిట్’ చిత్రం ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. ప్రభాస్ మారుతి చిత్ర షూటింగ్‌ను శర వేగంగా జరిపి వీలైతే ఈ ఏడాది చివర్లో కాని.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో కాని విడుదల చేయాలని మేకర్స్ పక్కా ప్లాన్ చేస్తున్నారట.