Telugu News

ఓవర్సీస్‌లో మంచి టాక్‌ సొంతం చేసుకున్న రాధేశ్యామ్‌

సినిమా-విజయంన్యూస్

0

ఓవర్సీస్‌లో మంచి టాక్‌ సొంతం చేసుకున్న రాధేశ్యామ్‌
(సినిమా-విజయంన్యూస్)
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొంది తాజాగా
ప్రేక్షకుల ముందుకు వచ్చిన అద్భుతమైన ప్రేమకథ రాధే శ్యామ్‌. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. దాదాపు 10 ఏళ్ళ తర్వాత ప్రభాస్‌ నుంచి వచ్చిన ఈ ప్రేమ కథకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్‌లో రికార్డు ఓపెనింగ్స్‌ సాధించింది. దీంతో హాలీవుడ్‌ సినిమాలతో పోటీపడి మరీ అద్భుతమైన వసూళ్లు సాధించింది రాధే శ్యామ్‌ అని అభిమానులు చెప్పుకుంటున్నారు.

also read :-అమరావతిలో ఉత్కంఠ

ఈ నేపథ్యంలో నార్త్‌ అమెరికాలో మరికొన్ని స్క్రీన్స్‌ యాడ్‌ చేశారు. అక్కడ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. తెలుగులో మంచి ప్రేమ కథ చూసి చాలా రోజులైంది. సౌత్‌లో మరీ ముఖ్యంగా మన తెలుగులో ఇప్పటి వరకు ఇంత భారీ బ్జడెట్‌తో వచ్చిన ప్రేమ కథ మరొకటి లేదు. ªూధే శ్యామ్‌ మాంచి విజువల్‌ ఫీస్ట్‌ అని అందరూ చెప్పుకోవడం ఆసక్తికరం. ప్రభాస్‌ లుక్స్‌, స్టైలింగ్‌ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రభాస్‌, పూజ హెగ్డే మధ్య కెమిస్టీ అద్భుతంగా వర్కవుట్‌ అయింది. ఈ సినిమాకు మరో ప్రధానమైన ప్లస్‌ పాయింట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌. క్లైమాక్స్‌ అత్యద్భుతంగా ఉంది. సాధారణంగా ప్రేమ కథల్లో ఈ తరహా క్లైమాక్స్‌ను ఎవరూ ఊహించరు. అదే ఇప్పుడు ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.

also read :-తనపై కుట్రతో చీటింగ్‌ కేసు నమోదు : బెల్లంకొడ్‌ సురేశ్‌ వెల్లడి

విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. జస్టిన్‌ ప్రభాకరన్‌ తనపై దర్శక నిర్మాతలు పెట్టిన నమ్మకాన్ని వందకు వంద శాతం ప్రూవ్‌ చేసుకున్నాడు. అద్భుతమైన పాటలు ఇచ్చాడు. తమన్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు బ్యాక్‌ బోన్‌. కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌.. ఇలాంటి భారీ బ్జడెట్‌ పాన్‌ ఇండియా లవ్‌ స్టోరీని చాలా బాగా హ్యాండిల్‌ చేశాడు. ఒకవైపు ప్రభాస్‌ ఇమేజ్‌ బ్యాలెన్స్‌ చేసుకుంటూ.. మరోవైపు తాను రాసుకున్న కథకు సరిగ్గా న్యాయం చేశాడు రాధాకృష్ణ. అందమైన కథ.. ఆకట్టుకునే స్క్రీన్‌ ప్లే.. వినసొంపైన సంగీతం అన్ని కలిపి అద్భుతమైన థియేట్రికల్‌ ఎక్స్పీరియన్స్‌ ఇచ్చే లవ్‌ స్టోరీ రాధే శ్యామ్‌ అని అభిమానులు, ప్రేక్షకులు అంటున్నారు.

 

please subscribe this chanel smiling chaithu