త్వరలో ఓటిటిలోకి ఆర్‌ఆర్‌ఆర్ మూవీ
(విజయం సినిమా న్యూస్);-
ఆర్ఆర్ఆర్ సినిమా అతిత్వరలో ఓటిటిలోకి అడుగుపెట్టనుంది.. దర్శకధీరుడు రాజమౌళి మలిచిన క్రేజీ మల్టీస్టా?రర్ ’ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబ్టటి.. సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను జీ5 వారు ఇదివరకే కొనుగోలు చేశారు. కానీ ఎప్పుడు స్టీమ్ర్ అవుతుంది అనే విషయంలో ఆసక్తి నెలకొంది.
also read :-ప్రభాస్ బిజిబిజీ..
తాజా సమాచారం ప్రకారం ’ఆర్.ఆర్.ఆర్’ చిత్రం జూన్ 3 నుంచి అన్ని భాషల్లోనూ స్టీమ్రింగ్ అవుతుందని తెలుస్తోంది. మార్చ్ 25న విడుదలైన చిత్రం దాదాపు 68 రోజుల తర్వాత ఓటీటీలోకి రానుండడం గమనార్హం. ఈ రోజుల్లో ఎంతటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా అయినప్పటికీ… విడుదలైన నెల రోజులకే డిజిటల్ రిలీజ్ కు రెడీ అయిపోతోంది. కానీ ’ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విషయంలో మాత్రం థియేట్రికల్ రిలీజ్ కు, డిజిటల్ రిలీజ్‌కు భారీ గ్యాప్ తీసుకున్నారు. మరి నిజంగానే ఈ సినిమా ఆ డేట్లోనే స్టీమ్రింగ్ అవుతుందో లేదో చూడాలి.
please subscribe this chanel smiling chaithu