Telugu News

RRR సినిమా విడుదల వాయిదా..?

* ప్యాన్స్ కు షాక్..

0

RRR సినిమా విడుదల వాయిదా..?

** ప్యాన్స్ కు షాక్..

(హైదరాబాద్-విజయం న్యూస్)
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన భారీ బడ్జెట్ సినిమా త్రిబుల్ ఆర్ విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎన్టీఆర్, రామ్ చరణ్ , ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తీసిన ఈ సినిమాను ఈ నెల 7న విడుదల చేయాలన చిత్రం యూనిట్ నిర్ణయించారు. కానీ అనుకొని పరిస్థితి లో ఈ సినిమాను వాయిదా వేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ గా జనవరి ఏడో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అభిమానులు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చేందుకు బయపడుతున్నారు.

ఈ సమయంలో సినిమా ఎప్పుడు విడుదల చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ఆ చిత్రం యూనిట్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని విడుదల వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది గంటల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉండొచ్చు. వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన సినిమా విడుదల అయితే చూడాలని ప్రపంచం ఎదురుచూస్తున్నది. ఎందుకంటే నందమూరి తారక రామారావు, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, బిగ్గెస్ట్ హిట్ సినిమాల దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంభినేషన్ లో తీసే సినిమా కాబట్టి ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

కానీ ఒమిక్రాన్ విజృంభిస్తున్న ఈ సమయంలో ఈ సినిమాను వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమమని ఈ మేరకు ఈ చిత్రం యూనిట్ ఆలోచనలో కనిపిస్తుంది. మరి కొద్ది నిమిషాలలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో తారకరామారావు, రామ్ చరణ్, చిరంజీవి ఫ్యాన్స్, ఎస్ ఎస్ రాజమౌళి కూడా కొంత నూతన సంవత్సరానికి ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నూతన సంవత్సరంలో సినిమా ఫ్యాన్స్ కు బాధాకరమైన విషయం.

also read :-అభివృద్ది లో వరంగల్ తూర్పు విక్టరీ.