Telugu News

రాజమౌళి దర్శకత్వంపై ఆర్జీవీ సంచలన కామెంట్స్‌

ఆర్ఆర్ఆర్ మూవీ పై సెటైర్లు

0

రాజమౌళి  పై ఆర్జీవీ సంచలన కామెంట్స్‌

== ఆర్ఆర్ఆర్ మూవీ పై సెటైర్లు

== సర్కస్ ఫీట్ సినిమా ఆర్ఆర్ఆర్ అంటూ షాకింగ్  కామెంట్స్

(సినిమా-విజయంన్యూస్)

సంచలన కామెంట్స్ తో హల్ చల్ చేసే రామ్ గోపాల్ వర్మ మరోసారి బాంబు పెల్చారు.. ప్రపంచంలోనే బిగెస్ట్ హిట్ గా నిలిచిన ఫాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. మరీ ఎంతగా  అంటే ఇండియాలోనే బెస్ట్  డైరెక్టర్ గా ఉన్న రాజమౌళిని కట్టిపుల్ల తీసి పడేసినట్లుగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ లో సన్నివేశాలు సర్కస్ ఫిట్ ను తలపించేలా ఉన్నాయని, మరీ నీటిలో బాలుడ్ని కాపాడే సన్నివేశం బిగెస్ట్ సర్కస్ ఫీట్ ను తలపించిందని షాకింగ్ కామెంట్ చేశారు.ఇటీవల ఆయన ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను చేసి ప్రపంచరికార్డును స్వంతం చేసుకుంది. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకు అభిమానులు ఉన్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ నటనకు ముగ్దుడైన కేంద్రహోమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ను లంచ్ పార్టీకి పిలిచి ఆయన్ను కలిసి అభినందించారు. అంతలా అకట్టుకున్న ఆర్ఆర్ఆర్ మూవిపై సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ మరో సంచనల ప్రకటన చేశారు. ఆర్ఆర్ఆర్ మూవి సర్కస్ ఫీట్ ను తలపించిందని, తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని.. సర్కస్‌ చూస్తున్నప్పుడు ఎలాంటి ఉత్సాహం కలుగుతుందో.. థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ చూస్తే అలాంటి భావననే కలిగిందన్నారు. అంతేనా.. మరో సంచలన ప్రకటన కూడా చేశారు..

ఇదికూడా చదవండి: చర్లలో మావోల ప్రజా కోర్టు

దేశంలోనే అద్భుతమైన సంగిత డైరెక్టర్ మణిరత్నం. ఆయనపై కూడా రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మణిరత్నం నాతో కలిసి పనిచేశారని, కానీ ఆయన సినిమాలు నాకు అసలే నచ్చవన్నారు. అంతేకాకుండా నా సినిమాలు కూడా మణిరత్నంకు నచ్చవని షాకింగ్ కామెంట్ చేశారు. ఒక్కసారి ఇద్దరం కలిసి స్క్రిప్ట్‌ వర్క్ లో కూర్చున్నామని, ఇద్దరికి అసలే పొసగలేదన్నారు. నేను కావలన్నది ఆయన వద్దన్నాడని, ఆయన కావాలన్నది నేను వద్దనన్నాని అన్నారు.  నా మాట ఆయన వినలేదు.. ఆయన మాట నేను వినలేదన్నారు. మొత్తానికి అటుఇటుగా మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన  ’దొంగ దొంగా’, ’గాయం’. ఈ రెండు సినిమాలు చివరకు విడుదలయ్యాయాని అన్నారు. ఆ సినిమాలకు  మా ఇద్దరి పేర్లు వేసుకున్నాం’అనీ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. ఇంకా మాట్లాడుతూ.. కాలేజీ రోజుల్లో  కమ్యూనిష్టు భావాజలాన్ని కలిగి ఉండేవాడిననని.. కానీ అయాన్‌ ర్యాండ్‌ పుస్తకాలు చదివినప్పటి నుంచి తనలో మార్పు వచ్చిందన్నారు. ఫెమినిజం అంటే స్త్రీలకోసం పోరాడటం కాదని.. స్త్రీలను ప్రేమించడం అని చెప్పాడు. తన కెరీర్‌లో ’క్షణక్షణం’, ’సర్కార్‌’చిత్రాలకే సరిగ్గా స్క్రిప్ట్‌ రాసి, సరైన నటీనటులను ఎంచుకున్నానని, మిగిలిన చిత్రాలన్ని ఫలానా హీరోతో చేయాలని అనుకోలేదని ఆర్జీవీ అన్నాడు.

ఇది కూడా చదవండి : కనులపండుగగా ‘పువ్వాడ’ వారి వివాహ రిసెప్షన్