Telugu News

ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాను అనుకోను… విజయేంద్ర ప్రసాద్

0

ప్రస్తుతం ఇండియా మొత్తంలో టాప్ మోస్ట్ సినిమా రైటర్స్ లో ప్రముఖంగా వినిపించే పేరు కే.విజయేంద్రప్రసాద్

విజయం డైలీ

ఆయన రాసిన ప్రతి సినిమా కథ ఏదో ఒక విధంగా సంచలనం సృష్టిస్తూనే ఉంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అగ్ర నిర్మాతలు దర్శకులు హీరోలు అందరూ కూడా ఆయన వెంట కథలకోసం తిరుగుతున్నారు.

అయితే విజయేంద్రప్రసాద్ రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందనే ఈ విషయంలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ విషయంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బాహుబలి రైటర్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.

ముఖ్యంగా అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న ఏకైక రైటర్ అంటూ రూమర్స్ చాలానే వచ్చాయి. అన్నిటికి ఒకటే సమాధానంగా విజయేంద్రప్రసాద్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ మిగతా వాళ్లకు పారితోషికం ఎంత ఇస్తున్నారు అనే విషయం గురించి నాకు తెలిస్తే నేను ఆ విషయంలో మొదటి స్థానంలో ఉన్నానా లేదా అనే విషయం నాకు అర్థం అవుతుంది.

కాబట్టి నేను ఎక్కువ డిమాండ్ చేస్తున్నాను అని అనుకోను. ఇక చాలా బిజీగా ఉన్నాను అని చాలామంది అనుకుంటారు. కానీ నేను అందరూ అనుకున్నట్టు అంత బిజీగా ఏమీ లేను. ఒకసారి కథ రాస్తే వెంటనే దర్శకుడికి అందజేస్తాను.

I Dont Think I Am Demanding High:Vijayandhra Prasad