Telugu News

ఏడాదికి రెండు సినిమాలు

తగ్గేదేలే అంటున్న నాగచైతన్య

0

ఏడాదికి రెండు సినిమాలు

== తగ్గేదేలే అంటున్న నాగచైతన్య

(సినిమా-విజయంన్యూస్)

యువ సామ్రాట్‌ నాగ చైతన్య తగ్గెదెలే అంటున్నాడు.. ఇప్పటి వరకు ఏడాదికో సినిమా చేస్తున్న నాగచైతన్య సినిమాల వేగాన్ని పెంచుతున్నాడు. ఇకపై ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్లాన్‌ చేసుకుంటున్నాడు. లవ్‌స్టోరి, బంగార్రాజుతో నాలుగు నెలల గ్యాప్‌లోనే రెండు బ్లాక్‌ బస్టర్‌ విజయాలను సాధించాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ’థాంక్యూ’, ’లాల్‌ సింగ్‌ చద్దా’ సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఈయన వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో సినిమాను చేయనున్నాడు.

also read;-కెజిఎఫ్‌`2 ట్రైలర్‌ సూపర్

ఇదిలా ఉంటే నాగచైతన్య మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. నాగచైతన్య మరో సినిమాకు సైన్‌ చేసినట్లు తెలుస్తుంది. సమంతతో ’ఓబేబి’ చిత్రాన్ని తెరకెక్కించిన నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుంది. ఇక నందిని సమంతకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అన్న విషయం తెలిసిందే. అయితే ముందుగా ఈ కథను నాగచైతన్య, సమంతలతో తెరకెక్కించాలని నందిని భావించిందట.

కానీ వీళ్ళీద్దరు విడాకులు తీసుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌కు పోస్ట్‌ పోన్‌ అయింది. ఇక తాజాగా ఈ కథను చైతన్యకు వినిపించిందట. నాగ చైతన్య కూడా ఈ కథకు వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని సమాచారం. ఈ చిత్రాన్ని వైజయంతి పిక్చర్స్‌ బ్యానర్‌పై స్వప్న దత్‌ నిర్మిస్తుందట. వెంకట్‌ ప్రభు సినిమా పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందని సమాచారం.